India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి TDPలోకి వెళ్తున్నారని, ఆయనకు TTDP అధ్యక్ష పదవి వస్తుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. దీనిపై ఈరోజు మేడ్చల్‌లో మల్లారెడ్డి అనుచర వర్గం స్పందించింది. ఆ వార్త ఫేక్ అని, ప్రజలు నమ్మొద్దని క్లారిటీ ఇచ్చారు. ఆయన TDPలో చేరేందుకు ఎలాంటి చర్చలు జరగలేదని, BRSలోనే ఉంటారని స్పష్టం చేశారు. ఫేక్ వార్తలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన లష్కర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర తేదీలను దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు, అర్చకులు సోమవారం వెల్లడించారు. జులై 7న ఘటోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. జులై 21న బోనాలు.. 22న భవిష్యవాణి (రంగం) కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈసారి ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించనున్నామని చెప్పారు. SHARE IT
సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, అధికారుల సమక్షంలో లెక్కింపు జరిగింది. 2 నెలల 15 రోజులకు గాను రూ.23,91,023 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపులో ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి, ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రామేశ్వర్, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు, బ్యాంక్ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
నీట్-2024 పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. HYD గాంధీభవన్‌లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో దయాకర్ మాట్లాడారు. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించి, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరీక్షను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ స్కామ్‌లో బీజేపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫైన్స్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) (అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, ఫొటోగ్రఫీ) తదితర కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సు రెండు, మూడు, నాలుగు, ఆరు, ఎనిమిది, పదో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 13వ తేదీలోగా చెల్లించాలన్నారు. రూ.500 అపరాధ రుసుముతో 20వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు.
వర్షాకాలంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలన్నారు. తమ వాహనాల టైర్ల గ్రిప్/థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోవాలన్నారు. టైర్ల గ్రిప్ బాగా లేకపోతే వెంటనే మార్చుకోవాలని సూచించారు. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నారు.
రాజేంద్రనగర్ ఆరాంఘర్ చౌరస్తా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ఆరంఘర్ చౌరస్తా వద్ద ముందు వెళ్తున్న బైక్‌ను బస్సు ఢీ కొట్టింది. దీంతో బస్సు చక్రాల కింద నలిగిపోయిన బైకిస్టు అక్కడక్కడే చనిపోయాడు. దీంతో బస్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఎన్నికల తర్వాత ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. నూతనంగా జిహెచ్ఎంసి ఇన్చార్జి కమిషనర్ అమ్రపాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులకు వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు.
వర్షాకాలం ఆరంభం కానున్న సమయంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణంగా ఏటా ఆషాఢం, శ్రావణమాసంలో ధరలు పెరిగి సామాన్యులను కుదేలు చేస్తుంటాయి. రంగారెడ్డి జిల్లాలో గతేడాది సరైన వర్షాలు పడకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండటంతో ఈసారి స్థానికంగా కూరగాయల సాగు, దిగుబడి తగ్గింది. పది రోజుల క్రితం కిలో పచ్చిమిర్చి రూ.60 నుంచి 80 ఉండగా.. ప్రస్తుతం రూ.120కి చేరింది.
సైబర్ సెక్యూరిటీ కోర్సులలో శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన వారు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఎథికల్ హ్యాకింగ్ తదితర కోర్సులకు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 23 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Sorry, no posts matched your criteria.