India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD ఎర్రగడ్డ అంగడి గత వందేళ్లుగా కొనసాగుతోంది. సంతలో అగ్గిపెట్టె నుంచి అలంకరణ వస్తువులు, కాళ్ల పట్టీల నుంచి కంప్యూటర్ విడిభాగాల వరకు దొరకందంటూ లేదు. అందుకే ఆన్లైన్ షాపింగ్ పెరిగినా.. ఈ సంతకు డిమాండ్ తగ్గలేదు. ప్రతి ఆదివారం ఉ.5 నుంచి రా.10 వరకు ఈ సంత కొనసాగుతుంది. 1910 నిజాం కాలంలో దీన్ని మొదలుపెట్టారు. ఎర్రగడ్డ వంతెన, పెట్రోల్ బంక్, చౌరస్తా నుంచి ఫతేనగర్ బ్రిడ్జి వరకు 3KM ఉంటుంది.
చిక్కడపల్లి CI సీతయ్యను HYD స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేస్తూ CP సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో బానోత్ రాజు నాయక్‌ను CIగా నియమించారు. అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో సీతయ్యను ట్రాన్స్ఫర్ చేసినట్లు సమాచారం. HYD కమిషనరేట్ పరిధిలో మరికొందరు అధికారులు బదిలీ అయ్యారు. ఖలీల్ పాషా-సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, సైదులు -ఖైరతాబాద్ DI, దోమలగూడ DIగా శ్రీశైలంను నియమించారు.
OUలో విద్యనభ్యసించిన ప్రొ.ఎం.కుమార్ అదే యూనివర్సిటీకి VCగా నియమితులయ్యారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధి కొండాపురంకు చెందిన ఆయన, భద్రాచలం GMR పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లమా సివిల్ ఇంజినీరింగ్, ఉస్మానియాలో B.Tech, JNTUలో M.Tech, IIT బాంబే నుంచి Ph.D పట్టా అందుకున్నారు. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్‌గా, ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్‌తో పాటు వివిధ విభాగాల్లో పనిచేశారు. అనేక అవార్డులు సైతం పొందారు.
హైదరాబాద్‌లో నేడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ వైపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద లాఠీఛార్జ్ జరగగా మరోవైపు ట్యాంక్ బండ్ వద్ద గ్రూప్ -1 అభ్యర్థులతో బండి సంజయ్ ర్యాలీ జరుగుతోంది. ఈ క్రమంలో భారీగా పోలీసులు మోహరించగా VST ఫ్లైఓవర్ బంద్ చేశారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పరేడ్ గ్రౌండ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయి. మరోవైపు బంద్ నేపథ్యంలో షాపులన్నీ మూసివేయడంతో క్లాక్ టవర్ వద్ద ఖాళీగా మారింది.
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఒక్కసారిగా వేలాది మంది హిందువులు తరలిరావడం, మసీదు ఉన్న రూట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కాగా పోలీసులపైకి ఆందోళనకారులు కుర్చీలు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. దీంతో పోలీసులు ఇంటర్నెట్ బంద్ చేసి వారిపై లాఠీఛార్జ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ప్రకటనలో తెలిపారు. బీఈడీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలను వచ్చే నెల 5 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
HYD నగరంలోని కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రూప్-1 మెయిన్స్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు సాగనున్న పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించే వద్ద సరైన భద్రత చర్యలు చేపట్టాలని సూచించారు.
సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టెస్టింగ్ రూమ్ తనిఖీలు చేశారు. తనిఖీల సమయంలో అధికారులు ఇంటర్ లాకింగ్ వాయిస్ లాగర్ సిస్టం పనిచేసే విధానాన్ని జనరల్ మేనేజర్ అధికారికి వివరించారు. సరైన సమయానికి సమాచారాన్ని చేరవేసి, ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు నూతన టెక్నాలజీ సహకరిస్తుందని తెలిపారు.
సికింద్రాబాద్ బంద్‌కు స్థానికులు పిలుపునిచ్చారు. దుండగుడు సలీం ఠాగూర్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసానికి నిరసనగా సికింద్రాబాద్ ప్రాంత ప్రజలు శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆలయం ముందు నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికతో కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానిక వ్యాపారులు, ఉద్యోగులు, దుకాణదారులు సహకరించాలని కోరారు.
HYDలో ట్రాఫిక్ నియంత్రణకు హైడ్రా నడుం బిగించింది. వాహనాల రద్దీ సమస్యతో పాటు, అక్రమ ఫుట్ పాత్, రహదారి ఆక్రమణల తొలగింపునకు ట్రాఫిక్ బృందంతో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. రహదారులు, కాలనీల్లో ఆక్రమణల తొలగింపు, నీరు నిలిచే ప్రాంతాల సమస్యల పరిష్కారానికి DRF బృందాలకు శిక్షణ అందించనుంది. అక్రమంగా ఉన్న ఫుట్‌పాత్, రోడ్ల పక్కన ఉన్న దుకాణాలు, చెత్త డబ్బాలు, ట్రాన్స్ఫార్మర్లను సైతం తొలగించనున్నారు.
Sorry, no posts matched your criteria.