India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ ఆడపడుచులకి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ఆడవపడుచులు బతుకమ్మను రంగు పూలతో అలంకరించి పూజలు చేయడం ఆనందం కలిగిస్తుందన్నారు. తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని కీర్తించారు.
ప్రభుత్వం జులై 17న హైడ్రా ఏర్పాటు చేస్తూ GO 59 జారీ చేసింది. గ్రేటర్‌తో పాటు 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 38 పంచాయతీలు, 61 పారిశ్రామికవాడలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను హైడ్రాకు అప్పగించింది. GHMC, స్థానిక సంస్థల పరిధి పార్కులు, లే అవుట్లు, ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జలవనరుల స్థలాలు పరిరక్షించడమే దీని బాధ్యత. తాజాగా 51 విలీన గ్రామాలు హైడ్రా పరిధిలోకి వచ్చాయి.
HYD మూసీ కాలుష్య కాసారంగా మారుతోంది. నీటిలో కరిగే ఆక్సిజన్ స్థాయి రోజురోజుకు తగ్గుతోంది. ఇదే సమయంలో రసాయనాల స్థాయి పెరుగుతుందని CPCB తెలిపింది. నీటిలో కరిగే ఆక్సిజన్(DO) CPCB ప్రకారం లీటర్ నీటిలో 6 మిల్లీ గ్రాములు ఉండాలి. కానీ, గండిపేట-6, బాపూఘాట్, ముసారాంబాగ్, నాగోల్, పీర్జాదిగూడ, ప్రతాపసింగారం, పిల్లాయిపల్లిలో 0.3 మాత్రమే ఉండటం ఆందోళనకరం. దీంతో మూసీలో జలచరాలు బతకడం కష్టమే.
సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో HYD పోలీసులు ఆంక్షలు విధించారు. అమరవీరుల స్మారకస్తూపం నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు సాధారణ వాహనాలకు అనుమతించరు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ చుట్టూ బతుకమ్మ వేడుక కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
హనుమకొండ, వరంగల్, తొర్రూరు, ఖమ్మం సహా ఇతర ప్రాంతాలకు HYD నగరం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సొంతూర్లకు వెళ్తున్నారు. రేపు సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో సాయంత్రం వేళ రైళ్లు, బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. కనీసం కూర్చునే పరిస్థితి లేదని ప్రయాణికులు వాపోయారు. రైళ్లలో వెళ్తున్న వారు ప్రతి స్టేషన్‌లో దిగి మళ్లీ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (SWM) కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)ని ప్రవేశపెట్టనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. బుధవారం 11 మంది ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలకు పెంచడానికి చురుకైన చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా ఆపరేటర్లు అందించిన వినూత్న సాంకేతికతలను సమావేశంలో పరిశీలించారు.
HYD మణికొండ డీఈఈ దివ్యజ్యోతిపై ఆమె భర్త శ్రీపాద్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె నిత్యం లంచం తీసుకుంటుందని పేర్కొంటూ.. నోట్ల కట్టలతో కూడిన వీడియోలను రిలీజ్ చేశారు. దీనిపై దివ్యజ్యోతి స్పందించారు. తాము గత సంవత్సరం నుంచి దూరంగా ఉంటున్నామని పేర్కొన్నారు. కోర్టులో విడాకుల కేసు నడుస్తోందని వెల్లడించింది. కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బతుకమ్మ నేపథ్యంలో TGRTC ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే స్పెషల్ బస్సుల్లో దాదాపు 25 శాతం అధికంగా ఉన్నట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. పండుగ వేళ తమ జేబులకు చిల్లు పడుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఉప్పల్ అధికారులను వివరణ కోరగా.. కేవలం స్పెషల్ బస్సులకే మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయన్నారు.
సద్దుల బతుకమ్మ వేడుకలకు రాజధాని ముస్తాబైంది. ఎల్బీస్టేడియం, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ అంతటా రేపు రాత్రి సందడే సందడి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి ట్యాంక్‌బండ్‌కు తీసుకొస్తారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు బాగ్‌లింగంపల్లి, KPHB, సరూర్‌నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్‌లోని GHMC మైదానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు బతుకమ్మ పాటలతో హైదరాబాద్ హోరెత్తనుంది.
తెలంగాణలో విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు సుమారు 19వేల మంది చాలీచాలని జీతాలతో వెట్టిచాకిరి చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా నారాయణగూడలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ రంగ ఆర్టిజన్ కార్మికులనూ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.