Hyderabad

News April 7, 2026

HYD: 108లో EMT ఉద్యోగాల ఇంటర్వ్యూలు

image

EMRI(108) సంస్థలో EMT పోస్టుల భర్తీకి ఏప్రిల్ 8న(బుధవారం) ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. B.Sc(BZC), ANM, DMLT, MLT, GNM, MPHA అర్హతలున్న 30ఏళ్లలోపు అభ్యర్థులు హాజరుకావచ్చు. ఉ.10 నుంచి మ.3 గంటల వరకు కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి వద్ద ఉన్న 108 రీజినల్ ఆఫీస్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో రావాలి. మరిన్ని వివరాలకు 9154248904కు ఫోన్ చేయవచ్చు. SHARE IT.

News April 7, 2026

HYD: అలర్ట్.. నల్లాలకు మోటార్లు.. రూ.5,000 FINE..!

image

నల్లాలకు మోటార్లు బిగించి లో-ప్రెజర్ వాటర్ సప్లైకి కారణమవుతున్న వారిపట్ల HMWSSB సీరియస్‌గా ఉంది. అలా చేసేవారికి రూ.5000 FINEతోపాటు మోటార్‌ను సీజ్ చేస్తామని MD అశోక్ రెడ్డి తెలిపారు. అందరికీ సమపాళ్లలో నీళ్లందాలనే ఈ చర్యలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. వేసవి ముగిసేవరకు లైన్‌మెన్ నుంచి MD పర్యవేక్షణలో ఈ ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు. నగరంలో ఇలా 40శాతం నల్లాలకు మోటార్లు ఫిక్స్ చేస్తున్నట్లు గుర్తించారు.

News April 7, 2026

HYD: బాలికపై అత్యాచారం.. నిందితుడికి జీవితఖైదు..!

image

కుషాయిగూడ సాయినగర్‌లో 2010లో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు కాకర్ల అనిల్ కుమార్‌కు జీవితఖైదు పడింది. 2012 నుంచి పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్ ఆధారంగా 2025 నవంబరులో నిందితుడిని కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి విజయవాడలో అరెస్ట్ చేశారు. నేరేడ్‌మెట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణలో అనిల్ నేరం చేసినట్లు తేలడంతో న్యాయమూర్తి జీవితఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించారు.

News April 7, 2026

HYD: మృత్యువుతో ముద్దులాట ‘సిటీ రేసింగ్’

image

HYD కుర్రాళ్లకు ఏమైంది? ప్రాణాలను ఫణంగా పెట్టి గాల్లో విన్యాసాలు చేస్తూ ‘వీల్‌యింగ్’ పిచ్చితో రోడ్లపై రెచ్చిపోతున్నారు. ‘సిటీ రేసింగ్’, ‘ట్రాఫిక్ స్టంట్స్’ పేర్లతో గ్యాంగ్‌లుగా జనాల మీదకు బైకులతో దూసుకొస్తున్నారు. పోలీసులు కేసులు పెట్టి, బైకులు సీజ్ చేస్తున్నా వీరిలో మార్పు రావడం లేదు. క్రేజ్ కోసం కన్నవారికి కడుపుకోత మిగిల్చకండి. రోడ్డు మీద విన్యాసాలు చేస్తే జైలులో ఊచలు లెక్కపెట్టాల్సిందే!

News April 6, 2026

HYD: పసిపాపకు పాలివ్వలేక.. ‘గుండె’ పగిలింది

image

పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసిపాప(26రోజుల)కు పాలివ్వలేని దీన స్థితిలో ఆ తల్లిని విధి దూరం చేసింది. ఆదివారం ఉప్పల్‌లో IPL మ్యాచ్ అయ్యాక ఏర్పడిన భీకర ట్రాఫిక్‌లో హార్ట్‌ఎటాక్‌తో బాలింత తల్లడిల్లింది. గంటకుపైగా ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకుంది. చివరకు ఆక్సిజన్ అయిపోవడంతో ఘట్‌కేసర్‌కు చెందిన బిష్ణ(30) కన్నుమూసింది. క్షణాలు లెక్కపెడుతూ, పసికూన భవిష్యత్‌ను ఊహించలేక ఆ కుటుంబం పడిన బాధ వర్ణనాతీతం.

News April 6, 2026

HYD: UPI ట్రాన్సాక్షన్ పర్యవేక్షణకు కొత్త చట్టం

image

ఆదాయాలను పెంచడానికి, పన్ను వసూళ్లలో అక్రమాలను అరికట్టడానికి, UPI, POS (పాయింట్ ఆఫ్ సేల్) లావాదేవీలను పర్యవేక్షించేందుకు TG GOVT ఒక కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం RevOne పోర్టల్‌ ద్వారా లావాదేవీల వివరాలను సురక్షితంగా సేకరించి, స్టోర్ చేస్తుంది. ఈ పోర్టల్ విధివిధానాలను రూపొందించి, సిఫార్సులు చేయడానికి ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక అధికారిక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.

HYDలో కొత్త ATMలు సక్సెస్.. ఇక రాష్ట్రమంతా

image

TGలో OP అధికంగా ఉండే ఆస్పత్రుల్లో హెల్త్ ATMలు (ర్యాపిడ్ డయాగ్నొస్టిక్ టెస్టింగ్ మెషీన్‌)లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. గతేడాది ఆగస్టులో కింగ్ కోఠి, మలక్‌పేట్ ఆస్పత్రుల్లో హెల్త్ ATMలను ప్రారంభించగా సక్సెస్ అయ్యాయి. ప్రతీ యూనిట్ 65 నాన్-ఇన్వాసివ్, 20 ఇన్వాసివ్ (రక్త ఆధారిత) పరీక్షలతో సహా 130 పరీక్షలను ఇక్కడ చేశారు. కేవలం 2నిమిషాల్లో ఫలితాలు వచ్చాయి. వీటిని TGవ్యాప్తంగా అమలు చేయనున్నారు