India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాత్రైతే బైకులు నడపాలంటే భయమేస్తోందని నగరవాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎదురొచ్చే వాహనాల LED లైట్స్‌తో కళ్లు కనిపించట్లేదని, ముందొచ్చే బండ్లు కనపడక ప్రాణాలు చేతుల్లో పట్టుకొని ప్రయాణిస్తున్నామని వాపోయారు. కోఠి, నాంపల్లి, మాదాపూర్ ఏరియాలోని రూట్లలో, శివారులో పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెబుతున్నారు. కొత్త వాహనాలకు వచ్చే లైట్స్ ఇబ్బందికరంగా ఉన్నాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన కళాసంధ్య కార్యక్రమంలో శ్రీరామ నృత్యాలయ విద్యార్థులు కూచిపూడి, భరతనాట్యం, ఫోక్ నృత్యాలతో ఆకట్టుకున్నారు. రాష్ట్రపతి నిలయం ఇన్‌ఛార్జి, మేనేజర్ రజనీ మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు ప్రాచీన కళలు నేర్పించడం అవసరమని అన్నారు. సీతాకళ్యాణం, ఇదిగో భద్రాద్రి, మూషిక వాహనం వీణ పుస్తక ధారిణి తదితర నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు.

కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం సాయంత్రం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అస్తమించేటప్పుడు సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని తాకడంతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఈ అపూర్వ క్షణాన్ని దర్శించేందుకు భక్తులు తరలివచ్చి ‘ఓం నమో భగవతే రామలింగాయ’ నామాన్ని స్మరించారు. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు దీనిని శివయ్య మహిమగా భావించి స్వామిని పూజించి తరిచినట్లు తెలిపారు.

మల్టీప్లెక్స్‌ల హవాలో భాగ్యనగర సినిమా చరిత్రకు సజీవ సాక్ష్యంగా ‘యాకుత్ మహల్’ థియేటర్ నిలుస్తోంది. 1930ల్లో నవాబ్‌జాఫర్ నవాజ్‌జంగ్ నిర్మించిన ఈ చారిత్రక వేదికల్లో సాక్షాత్తూ నిజాం ప్రభువులే సినిమాలు వీక్షించారు. ఇప్పటికీ పాతతరం చికాగో ప్రొజెక్టర్లతోనే ఇక్కడ షోలు నడుస్తుండటం విశేషం. అతి తక్కువ టికెట్ ధరతో సామాన్యులకు వినోదాన్ని పంచుతూ, ఓటీటీల కాలంలోనూ తన ఉనికిని కాపాడుకుంటుంది.

హైదరాబాద్ మెట్రో రెండోదశ విస్తరణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు పార్లమెంట్‌లో కేంద్రం సమాధానం ఇచ్చింది. రెండో దశ విస్తరణకు సంబంధించి ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేసింది. అలాగే మెట్రో ఫేస్-1 స్వాధీనంపై ప్రభుత్వానికి సూచనలు మాత్రమే చేశామని పేర్కొంది. దీంతో అసలు మెట్రో రెండోదశ ఎప్పుడు పూర్తవుందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇండియా స్కిల్స్ 2026లో లాజిస్టిక్స్ & ఫ్రైట్ ఫార్వార్డింగ్ విభాగంలో నగరానికి చెందిన మెహ్రునిషా బేగం గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఆమె ప్రయాణం కృషి, పట్టుదలకి నిదర్శనం. బేగంపేట డిగ్రీ కాలేజీ అలుమ్ని అయిన ఆమె ప్రస్తుతం కార్గోమాన్ లాజిస్టిక్స్‌లో పనిచేస్తున్నారు.

నేడు HYDలో ఐపీఎల్ సందడి నెలకొననుంది. ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో మన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనుంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో నగర క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భాగ్యనగర గడ్డపై ‘ఆరెంజ్ ఆర్మీ’ విజయకేతనం ఎగరవేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మ్యాచ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Sorry, no posts matched your criteria.