Hyderabad

News April 6, 2026

HYD: KTR కృషికి అరుదైన గౌరవం

image

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు బెంగళూరులో జరిగే ‘ఎంట్రప్రెన్యూర్‌ ఇండియా ఐడియా 2026’కు ముఖ్య అతిథిగా ఆహ్వానం లభించింది. ఏప్రిల్ 16న వైట్‌ఫీల్డ్‌లోని షెరటాన్ గ్రాండ్ హోటల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. దేశవ్యాప్తంగా 300 మందికిపైగా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు పాల్గొననున్నారు. ఇన్నోవేషన్, పరిశ్రమల అభివృద్ధిలో కేటీఆర్ కృషికి గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం దక్కింది.

News April 6, 2026

HYD: మహిళలకు బ్యూటీషియన్ ఫ్రీ శిక్షణ

image

చిలుకూరులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు ఉచిత టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులు ఏప్రిల్ 13న ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన 19- 45 ఏళ్ల మహిళలకు 30 రోజుల శిక్షణతో పాటు హాస్టల్ వసతి, భోజనం, టూల్ కిట్లు అందిస్తారు. ఆసక్తిగల వారు 95506 06019 నంబర్‌ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని డైరెక్టర్ అలీ ఖాన్ తెలిపారు.

News April 6, 2026

సికింద్రాబాద్ KVSలో అడ్మిషన్లు ప్రారంభం

image

సికింద్రాబాద్ పికెట్‌లోని కేంద్రీయ విద్యాలయం(KVS)లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 4వ తరగతికి ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పాఠశాల అధికారులు తెలిపారు. ఆసక్తి గల తల్లిదండ్రులు నేరుగా పాఠశాలకు వెళ్లి దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం సూచించింది.

News April 6, 2026

హైదరాబాద్‌లో నేడు అక్కడక్కడ చిరు జల్లులు

image

హైదరాబాద్‌లో ఇవాళ పాక్షిక మేఘావృతమైన వాతావరణం ఉండనుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 37℃, కనిష్ఠం 26℃ వరకు నమోదు కానుందని, వాయవ్య దిశ నుంచి గంటకు 4- 6 కి.మీల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

News April 6, 2026

HYD: సర్వ రోగాలకు మందు ఇక్కడే!

image

ప్రజలకు వ్యాధులు వస్తే అత్యాధునిక ఆస్పత్రుల్లో వైద్యం అందించేకంటే అవి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జిమ్ ఫీజు భరించలేక వీటికి దూరమవుతున్నారు. రోజూ 45 MIN వ్యాయామంతో షుగర్, BP రావని నిపుణల మాట. GHMCలోని వార్డుల్లో, శివారు గ్రామాల్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి, పాడైనవి రిపేర్ చేయాలి. దీనికోసం కబ్జా అయిన పార్క్ స్థలాలను విడిపించి పార్క్‌గా, ఓపెన్ జిమ్‌గా మార్చితే సరి. మీరేమంటారు?

News April 6, 2026

ఇగ అంతా HYD 2.0 నయా స్టైల్!

image

నగర యువత టేస్ట్ ఇప్పుడు ‘HYD 2.0’ వైపు మళ్లింది. రెస్టోబార్ల నుంచి కేఫీల వరకు అంతా నాటు రుచులకు మోడ్రన్ టచ్ ఇస్తున్నారు. ఇక్కడ ‘మైండ్‌ఫుల్ ఇండల్జెన్స్’ ట్రెండ్ నడుస్తోంది. ఇష్టమైనవి తింటూ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం. అందుకే షుగర్ బదులు మాంక్ ఫ్రూట్, స్టివియా వాడుతున్నారు. మందు లేని కాక్‌టెయిల్స్, గట్-హెల్త్ పెంచే Matcha డ్రింక్స్‌తో పాటు ఇన్‌స్టా రీల్స్ కోసం సమ్మర్ కూలర్స్ ఇప్పుడు స్పెషల్ ఎట్రాక్షన్!