India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
10 మార్చి 2011 యాదుందా? సరిగ్గా 14 ఏళ్ల క్రితం భాగ్యనగరమంతా బారికేడ్లు.. పట్నమంతా పారామిలిటరీ బలగాలు.. అడుగడుగునా అరెస్టులు. అయినా దరువేస్తూ తెలంగాణ దండు కదిలింది. ట్యాంక్ బండ్ మీద కవాతు చేసింది. మలిదశ TG ఉద్యమాన్ని మలుపు తిప్పింది. అదే మిలియన్ మార్చ్. నిరోధాలను ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆ రోజు తెలంగాణ కోసం వేసిన ప్రతీ అడుగూ ప్రత్యేక రాష్ట్ర సాధన కల నెరవేర్చుకునేందుకు సాకరమైంది.
ఎల్బీనగర్‌లోని పలు ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని పలువురు మండిపడుతున్నారు. కామినేని వద్ద లాడ్జీలు, హోటళ్లు వ్యభిచార కేంద్రాలకు అడ్డాగా మారాయని,అధికారులు నిఘా కరవవ్వడంతో ఆడిందే ఆటగా మారిందంటున్నారు. ORR, ఆటోనగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, గుర్రంగూడా, DSNR హైవేలపై రాత్రుళ్లు కొందరు అసభ్యకర దుస్తులతో నిలబడి సైగలు చేస్తూ బాటసారులను ఇబ్బంది పెడుతున్నారు. వీటిని నివారించాలని కోరుతున్నారు.
హైదరాబాద్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫీవర్ నడుస్తోంది. భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్‌పై మరింత ఉత్కంఠ పెరిగింది. జనాలు మొత్తం టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్ల మీద జనసంచారం తగ్గింది. సిటీలోని అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్‌లలోని LED టీవీల్లో మ్యాచ్ ప్రదర్శించగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉండడంతో మరింత ఆసక్తిగా నగరవాసులు వీక్షిస్తున్నారు.
TGలో మరో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. HYD, RR జిల్లాల్లో కొత్తగా చాంద్రాయణగుట్ట, చేవెళ్ల, వికారాబాద్, తాండూరులో ఈ స్కూల్స్ నిర్మిస్తున్నారు. ఒక్కోస్కూల్‌కు రూ.200 కోట్ల చొప్పున కేటాయించారు. గతంలోనే 3 స్కూల్స్‌కు GO ఇచ్చినట్లు భట్టి తెలిపారు. కాగా, గతేడాదే కొందుర్గులో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు CM శంకుస్థాపన చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం తెలంగాణ భవన్‌లో జరగనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ కార్యాలయం ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.
ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ PMJ జువెల్స్ హైదరాబాద్‌లోనే అతిపెద్ద వెడ్డింగ్ & హాఫ్ శారీ ఎగ్జిబిషన్‌ను తాజ్ కృష్ణలో శుక్రవారం ప్రారంభించింది. ఇందులో సంప్రదాయం, ఆధునికత కలబోతతో కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 20,000+ ఆభరణాలు అందుబాటులో ఉన్నట్లు మేనేజ్మెంట్ తరపున ప్రతీక్ జైన్ తెలిపారు. మూడు రోజుల పాటు సాగిన ఎగ్జిబిషన్ ఆదివారం ముగియనుందని, కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
HYD మెట్రో అరుదైన ఘనత సొంత చేసుకుంది. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి మెట్రోలో గుండెను తరలించారు. డయిలేటెడ్ కార్డియోమయోపతి సమస్యతో బాధపడుతున్న 44 ఏళ్ల వ్యక్తికి శనివారం ఎమర్జెన్సీ అవ్వగా వారు మెట్రోనే ఎంచుకున్నారు. వైద్యులు నాగోల్‌లో మెట్రో ఎక్కి జూబ్లీహిల్స్‌లో దిగారు. ఇలా గుండెను తరలించడాన్ని గ్రీన్ ఛానల్ అంటారు.
గతవారం రూ.193 ఉన్న స్కిన్‌లెస్ చికెన్ ధర నేడు రూ.140కి పడిపోయింది. ఫిబ్రవరి చివరివారంలో రూ.152 ఉండగా రంజాన్ ప్రారంభంలో ధరలు పెరిగాయి. ఈ వారం ఏకంగా రూ.50కిపైగా చికెన్ ధర పడిపోయింది. రిటైల్‌లో నేడు గుడ్ల ట్రే రూ.150గా ఉంది. పలు చోట్ల తెల్లవారు జామునుంచే మటన్, చేపల మార్కెట్ల వద్ద ప్రజలు బారులుతీరారు. మటన్ కిలో రూ.850-1000 వరుకు, చేపల రకాలని బట్టి కిలో రూ.200లకుపైగా విక్రయాలు జరుగుతున్నాయి.
టీం ఇండియన్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ శనివారం తన నివాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో నాంపల్లి MIM ఎమ్మెల్యే మహమ్మద్ మజీద్ హుస్సేన్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ చేశారు. ఈ విందుకు సిరాజ్, కుటుంబసభ్యులు, బంధువులతో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు.
తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు. అయితే, ఆ రహదారుల ప్రారంభానికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.