India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు. అయితే, ఆ రహదారుల ప్రారంభానికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని పేర్కొన్నారు.
పెళ్లైన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలానగర్‌లో జరిగింది. బాల్‌రెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న విజయగౌరి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. గత నెల 6వ తేదీన ఈశ్వరరావుతో విజయగౌరికి వివాహం జరిగింది. మృతురాలి స్వస్థలం ఏపీలోని విజయనగరం జిల్లా. ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.
ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ప్రధాన నిందితుడు అమర్ దీప్‌కు చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సీజ్ చేశారు. అమర్ దీప్ కుమార్ ఇదే విమానంలో జనవరి 22న దుబాయ్ పారిపోయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే కేసులో ఫిబ్రవరి 15న ఫాల్కన్ డైరెక్టర్స్ పవన్ కుమార్, కావ్య నల్లూరిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బైక్ రైడింగ్ అంటే మగవారాకి మాత్రమే అనుకునే ఈ కాలంలో మేము కూడా దేనికి తీసిపోమని నిరుపిస్తున్నారు HYDకు చెందిన జైభారతి. బుల్లెట్ బైక్ వేసుకొని 7 దేశాలు, లక్ష కి.మీ తిరిగొచ్చారు. ఆర్కిటెక్ట్‌గా విధులు నిర్వహిస్తూ బైక్ రైడింగ్ చేస్తున్న జైభారతి 2013లో ‘బైకర్నీ విమెన్ గ్రూప్ HYD చాప్టర్’ ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ అంతా బైకులపై పలు ప్రాంతాలకు వెళ్లేవారు. ఆమె సహసాన్ని ప్రధాని మోదీతో పాటు KCR అభినందించారు.
HYD పేరు నిలబెడుతోందీ ఈ సింగర్. ఆధ్యాత్మిక పాటలతో సంగీత ప్రియులను కట్టిపడేస్తూ దేశ, విదేశాల్లో 650 పైగా కల్చరల్ ఈవెంట్‌లలో పాల్గొంది. 9 ఏళ్ల వయసులోనే తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్‌లో 17 కీర్తనలతో అల్బమ్ విడుదల చేసింది. తన ప్రతిభతో ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో పేరుతెచ్చుకుంది. బర్కత్‌పురాలో ఉండే వివేక్ ఆనంద్, సుచిత్ర దంపతుల కుమార్తెనే ఈ మాళవిక ఆనంద్. ఓ మగువా నీ ప్రతిభకు సలాం.
HAPPY WOMEN’S DAY
టీ-హబ్ కొత్త సీఈవోగా కవిక్రుత్ నియామకమయ్యారు. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఉత్తర్వులను జారీచేశారు. టీ-హబ్ సీఈవో పోస్టు కోసం 9 అప్లికేషన్లు వచ్చాయని, వాటిని స్క్రుటినీ చేసి కవిక్రుత్‌ను సీఈవోగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారని వెల్లడించారు.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టం పౌరుల డిజిటల్ గోప్యతకు ముప్పు అని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. నూతన చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అపరిమిత అధికారలున్నాయని, నూతన చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కాలరాస్తుందన్నారు. ఇది దేశ ప్రజల డిజిటల్ హక్కులపైన కేంద్రం చేస్తున్న దాడి, దేశ ప్రజలు, విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
HYD విస్తరణకు మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న HMDA పరిధి తాజా నిర్ణయంతో సుమారు 11వేల చదరపు కిలోమీటర్ల నుంచి 12 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరగనుంది. కొత్తగా RRR వరకు విస్తరించడంతో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 16 మండలాలు సుమారు 1,400 పైగా గ్రామాలతో HMDA పరిధి భారీగా పెరగనుంది.
ఈ నెల 23న రాజస్థాన్ రాయల్స్, 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ జట్టు తలపడనుంది. ఈ 2 మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో జరిగే రెండు మ్యాచ్‌ల టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని సన్‌రైజర్స్ ప్రకటించింది. కాగా.. ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ల విక్రయం ఇవాళ ఉ.11 నుంచి ప్రారంభంకానుంది.
జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో శుక్రవారం నుంచి నేషనల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు జేఐసీ సెక్రటరీ కిలారు రాజేశ్వర రావు తెలిపారు. జాతీయ స్థాయి హోటా, జేఐసీ నేషనల్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ నగరంలో జరుగుతాయన్నారు. 3 రోజుల పాటు పోటీలు నిర్వహిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.