India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు, రేపు HYDలో లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఇతర కేసుల కారణంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానులు, తమ కేసులు త్వరగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. స్థానిక PSకు వెళ్లి తమ కేసుల వివరాలను అందజేసి, లోక్ అదాలత్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీంతో కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని పోలీస్ ఉన్నత అధికారులు తెలిపారు.
కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ – ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. సీఎం ఎక్కడ బాధ్యత తీసుకుంటే అక్కడ బీజేపీ గెలుస్తుందని అన్నారు. రేవంత్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ భస్మమే అని ఆరోపించారు.
ఈ నెల 8న పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న మహిళా సదస్సు ఏర్పాట్లను బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వసతులు తదితర అంశాలను చర్చించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులకు బైసన్‌పోల్ మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని, మహిళలకు మజ్జిగప్యాకెట్లు అందించాలన్నారు.
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రొ.నాగలపల్లి నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఆయన ఒడిశాలోని గంగాధర్ మెహర్ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో అధ్యాపకుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు.
రావిర్యాల ORR ఎగ్జిట్ 13 వద్ద యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల సమాచారం.. ORRపై చెట్లకు నీళ్లు పడుతున్న సిబ్బందిని కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కార్ డ్రైవర్, కోప్యాసింజర్, ఫ్లాగ్ మ్యాన్ మృతిచెందారు. ఘట్కేసర్ వద్ద 3:15కు కార్ ఎంట్రీ అవ్వగా.. 3:30కి యాక్సిడెంట్ జరిగిందని, 15 MINలో దాదాపు 37 కి.మీ చేరుకునేంత ఓవర్ స్పీడ్‌లో వచ్చాడని అధికారి తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ – ఖమ్మం – నల్గొండ నుంచి శాసనమండలికి ఎన్నికైన పింగిలి శ్రీపాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజాప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. ఈ ఎన్నికలో విజయం సాధించిన శ్రీపాల్ రెడ్డికి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
అంబర్‌పేట్‌లో నూతన ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయ భవనాన్ని గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్, సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. పోలీసుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఫైర్ స్టేషన్ నిర్మాణానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నగర భద్రత కోసం సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఉపయోగాన్ని పెంచాలని సూచించారు. పోలీసులను చూస్తే నేరస్థలకు భయంపుట్టాలని, ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్ కల్చర్ వేరు. ఊర్లో 10 ఎకరాలు ఉంటే గొప్ప. ఇక్కడ 100 గజాల్లో సొంతిళ్లు ఉన్నా గొప్పే. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండేది హైదరాబాదీలే అనిపిస్తది. పండుగలు, పబ్బాలకు బలగం ఏకమవుతుంది. కుల, మత భేదం లేకుండా దోస్తానా కోసం జాన్ ఇస్తరు. మాస్‌కు కేరాఫ్ ధూల్‌పేట గల్లీలైతే, క్లాస్‌కు కేరాఫ్‌గా IT కారిడార్. ఏకంగా లక్షల మందికి మన HYD ఉపాధినివ్వడం విశేషం.
We Proud to Be A Hyderabadi
HYDలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తరుణి సూపర్ మార్కెట్ వెనకాల రాత్రి ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో స్నేహితుడు నగేశ్‌ను నర్సింగ్ అనే వ్యక్తి కర్రతో కొట్టి చంపేశాడు. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీకి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BHEL జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తున్న కారణంగా ఈనెల 8న నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని HMWSSB అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎర్రగడ్డ, SRనగర్, HBకాలనీ, మూసాపేట, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, అశోక్‌నగర్, RCపురం, లింగంపల్లి, చందానగ, మదీనాగూడ, మియాపూర్, గంగారం, జ్యోతినగర్, బీరంగూడ, శ్రీనగర్, అమీన్‌పూర్, నిజాంపేట్‌లో అంతరాయం ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.