India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తరుణి సూపర్ మార్కెట్ వెనకాల రాత్రి ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో స్నేహితుడు నగేశ్‌ను నర్సింగ్ అనే వ్యక్తి కర్రతో కొట్టి చంపేశాడు. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీకి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BHEL జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తున్న కారణంగా ఈనెల 8న నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని HMWSSB అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎర్రగడ్డ, SRనగర్, HBకాలనీ, మూసాపేట, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, అశోక్‌నగర్, RCపురం, లింగంపల్లి, చందానగ, మదీనాగూడ, మియాపూర్, గంగారం, జ్యోతినగర్, బీరంగూడ, శ్రీనగర్, అమీన్‌పూర్, నిజాంపేట్‌లో అంతరాయం ఉంటుందన్నారు.
లోయపల్లిలో గుడి ధ్వంసం చేసిన అధికారులపై, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై జాతీయ ST కమిషన్‌కు బీజేపీ రాష్ట్ర కమిషన్‌కు అధ్యక్షుడు డా.కల్యాణ్ నాయక్, రంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా ఫిర్యాదు చేశారు. గత నెల 25న సేవాలాల్ మహారాజ్ గుడిని కొందరు కుట్రపూరితంగా కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీని సస్పెండ్ చేయాలని, ST/SC కేసు నమోదు చేయాలని కోరారు.
తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. రేవంత్ టీపీసీసీ చీఫ్, సీఎం కావాలని తీన్మార్ మల్లన్న బలంగా కోరుకున్నారని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పార్టీ బలహీనపడుతుందనే కారణంగా రేవంత్‌కు టీపీసీసీ పదవి ఇవ్వాలని మల్లన్న కోరారని చెప్పారు. తీన్మార్ మల్లన్న ఏది మాట్లాడినా దానికి వివరణ రేవంత్ రెడ్డి ఇవ్వాలన్న వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ బృందం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ ఒప్పందం ప్రకారం ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కోరారు. సీఎం అధిష్టానంతో చర్చించి సానుకూలంగా స్పందిస్తానని తెలిపారు. సమావేశంలో సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.
పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సచివాలయం వద్ద అధికారులు కూల్ ఐడియా అమలు చేశారు. సచివాలయానికి వచ్చే సందర్శకులు, అధికారులను తనిఖీ చేసే సమయంలో ఎండకు ఇబ్బంది పడకుండా గేట్ నంబర్-2 వద్ద టెంట్లు ఏర్పాటు చేశారు. టెంట్ నీడ కింద భద్రతా సిబ్బంది తనిఖీలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీకాం, బీబీఏ, బీఏ, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్, బీబీఏ లాజిస్టిక్స్, బీబీఏ ఫ్యాషన్ మేనేజ్మెంట్, బీబీఏ ఫ్యాషన్ డిజైన్ మేనేజ్మెంట్, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ 3, 5 సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
HYDలో బీర్ సీసాలపై పాత ధరలే దర్శనమిస్తున్నాయని ఓ కస్టమర్ తెలిపారు. నాగోల్‌లోని వైన్ షాపులో బుధవారం బీఎస్ పాటిల్ అనే వ్యక్తి 2 బీర్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. MRP మాత్రం రూ.210గా ఉంది. ఇటీవల పెంచిన ధరల ప్రకారం రూ.250కి అమ్మినట్లు పేర్కొన్నారు. లేబుల్స్‌పై పాత ధరలు ఉండటం ఏంటని నిలదీస్తే వైన్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయారు. మీప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.
మలక్‌పేటలో శిరీష హత్య కేసులో మరో కోణం వెలుగుచూసింది. భర్త వినయ్ సోదరి సరిత హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. మత్తు మందు ఇచ్చి మర్డర్ చేసినట్లు నిర్ధారించారు. ఇది తెలిసి వినయ్ మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడు. గుండెపోటుతో చనిపోయిందని చిత్రీకరించాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నగర శివారులో భూగర్భజలాలు తగ్గడంతో వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి సమయంలో శంకర్‌పల్లి, జన్వాడ, పూర్ణనంద ఆశ్రమం రోడ్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో బోర్లువేసి కొందరు నీటిని తోడేస్తున్నారు. దీనివలన ఆయా ప్రాంతాల్లో లో ప్రెషర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, వట్టినాగులపల్లి, ఖానాపూర్ గ్రామాల్లో ఏకంగా 25 బోర్లను అధికారులు సీజ్ చేశారు.
Sorry, no posts matched your criteria.