India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 27- SEP 6 వరకు ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రోజూ ఉ.11 నుంచి రద్దీని బట్టి ప్రధాన మార్గాలైన VV స్టాచ్యూ, సైఫాబాద్ పాత PS, నెక్లెస్ రోటరీ వైపుల నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తామన్నారు. భక్తులు మెట్రో, బస్సులు వంటి ప్రజారవాణాను ఉపయోగించాలాన్నారు. ఐమాక్స్, విశ్వేశ్వరయ్య భవన్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.
HYD అగ్నిమాపక కానిస్టేబుల్ అవుల నరసింహ, ఐసీఎన్ ప్రో కార్డ్ గెలుచుకుని అంతర్జాతీయ బాడీబిల్డింగ్ పోటీలకు అర్హత సాధించారు. ‘Mr. Fit Cop’గా పేరుగాంచిన నరసింహ, తన వృత్తిని, క్రీడా జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఘనతతో భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. నరసింహను పలువురు అభినందించారు.
వినాయక ఉత్సవాలు ప్రారంభం కాకముందే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరిగింది. దోమల్‌గూడకు చెందిన మండప నిర్వాహకులు వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేసి సోమవారం మండపానికి తరలిస్తుండగా హిమాయత్‌నగర్‌లో కేబుల్స్‌కు తగిలి కింద పడిపోయింది. ఈ ఘటనలో విగ్రహం కొంత ధ్వంసం అయింది. దీంతో నిర్వాహకులు ఆ విగ్రహాన్ని పీపుల్స్‌ప్లాజా వద్ద క్రేన్ సహాయంతో నిమజ్జనం చేశారు.
కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసులో విచారణ వేగం పుంజుకుంటోంది. నిందితుడైన బాలుడిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నట్టు సమాచారం. క్రిమినల్ కావాలనే లక్ష్యంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టిన్నట్లు దర్యాప్తులో బయటపడింది. బాలుడి ఫోన్‌లో క్రైమ్ సిరీస్ ఎపిసోడ్‌లు అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అతడి వద్ద లభించిన లెటర్‌తో సహస్ర హత్యకు సంబంధం లేదని విచారణలో తేలింది.
స్వాతి హత్య కేసులో నిందితుడైన మహేందర్ రెడ్డి కుటుంబం ఇంకా పరారీలోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్వాతి హత్య విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వారు ఊరు విడిచి వెళ్లి పోయారని గ్రామస్థులు తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే మృతదేహం విడిభాగాలు దొరకకపోవడంతో మొండానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.
HYDలో సంచలనం రేపిన స్వాతి హత్య కేసులో కిరాతకుడు మహేందర్‌రెడ్డి చేసిన పనులు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లైన నెల నుంచే అనుమానం, పంచాయతీలు పెట్టి ఊరందరి ముందు పరువు తీసిందన్న కక్షతో భార్య స్వాతిని చంపి ముక్కలు చేశాడు. అనంతరం ఇంటి దగ్గర పాన్‌షాప్‌కు వెళ్లి ఏమీ జరగనట్లు తాపీగా సిగరెట్ తాగాడని పోలీసులు విచారణలో తేలింది. ఈ పైశాచిక భర్త ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్నాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్ సూచన మేరకు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై అభ్యంతరాలు నేడు సమర్పించాలని HYD ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. సోమవారం GHMC ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఉన్న 329 పోలింగ్ స్టేషన్ల స్థానంలో 408 పోలింగ్ స్టేషన్లు ప్రతిపాదించామని, ఈ నివేదికను 28వ తేదీలోగా ఎన్నికల కమిషన్‌కు పంపించాలన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులు నియమితులయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నోడల్ ఆఫీసర్లకు సహాయకులుగా మరికొందరినీ నియమించారు. వీరంతా తమకు కేటాయించిన విధులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని కర్ణన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
వినాయక చవితి ఏ రోజు నిర్వహించుకోవాలనే విషయంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే ఈ నెల 22, 23 రెండు రోజులు అమావాస్య రావడంతో చవితి ఏ రోజు అనేది అర్థం కావడం లేదు. దీంతో భాద్రపద శుక్ల చవితి ఈ నెల 27న అని, ఆ రోజే వినాయక చవితి జరుపుకోవాలని షాద్‌నగర్‌లోని వేద పండితులు క్లారిటీ ఇచ్చారు. వినాయక పూజ చేసుకోవడానికి ఉ.11:05 నుంచి మ.1:40 వరకు మంచి ముహూర్తం అన్నారు. నిమజ్జనం సెప్టెంబర్ 6న చేయాలన్నారు.
శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ‘X’లో పోస్ట్‌చేశారు. ఎయిర్‌పోర్టు బోర్డింగ్ పాయింట్ నుంచి నేరుగా శ్రీశైలానికి బయలుదేరవచ్చని పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సజ్జనార్ కోరారు.
Sorry, no posts matched your criteria.