Hyderabad

News August 26, 2025

HYD: క్రిమినల్ కావాలనే సహస్ర మర్డర్

image

కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసులో విచారణ వేగం పుంజుకుంటోంది. నిందితుడైన బాలుడిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నట్టు సమాచారం. క్రిమినల్ కావాలనే లక్ష్యంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టిన్నట్లు దర్యాప్తులో బయటపడింది. బాలుడి ఫోన్‌లో క్రైమ్ సిరీస్ ఎపిసోడ్‌లు అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అతడి వద్ద లభించిన లెటర్‌తో సహస్ర హత్యకు సంబంధం లేదని విచారణలో తేలింది.

News August 26, 2025

HYD: పరారీలోనే మహేందర్ రెడ్డి కుటుంబం

image

స్వాతి హత్య కేసులో నిందితుడైన మహేందర్ రెడ్డి కుటుంబం ఇంకా పరారీలోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్వాతి హత్య విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వారు ఊరు విడిచి వెళ్లి పోయారని గ్రామస్థులు తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే మృతదేహం విడిభాగాలు దొరకకపోవడంతో మొండానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

News August 26, 2025

HYD: హత్య చేసి తాపిగా వెళ్లి సిగరెట్ తాగాడు!

image

HYDలో సంచలనం రేపిన స్వాతి హత్య కేసులో కిరాతకుడు మహేందర్‌రెడ్డి చేసిన పనులు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లైన నెల నుంచే అనుమానం, పంచాయతీలు పెట్టి ఊరందరి ముందు పరువు తీసిందన్న కక్షతో భార్య స్వాతిని చంపి ముక్కలు చేశాడు. అనంతరం ఇంటి దగ్గర పాన్‌షాప్‌కు వెళ్లి ఏమీ జరగనట్లు తాపీగా సిగరెట్ తాగాడని పోలీసులు విచారణలో తేలింది. ఈ పైశాచిక భర్త ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్నాడు.

News August 26, 2025

HYD: అభ్యంతరాలకు నేడు లాస్ట్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్ సూచన మేరకు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై అభ్యంతరాలు నేడు సమర్పించాలని HYD ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. సోమవారం GHMC ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఉన్న 329 పోలింగ్ స్టేషన్ల స్థానంలో 408 పోలింగ్ స్టేషన్లు ప్రతిపాదించామని, ఈ నివేదికను 28వ తేదీలోగా ఎన్నికల కమిషన్‌కు పంపించాలన్నారు.

News August 26, 2025

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. నోడల్‌ అధికారులు రెడీ

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల నిర్వహణకు నోడల్‌ అధికారులు నియమితులయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నోడల్‌ ఆఫీసర్లకు సహాయకులుగా మరికొందరినీ నియమించారు. వీరంతా తమకు కేటాయించిన విధులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని కర్ణన్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

News August 26, 2025

HYD: వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలంటే!

image

వినాయక చవితి ఏ రోజు నిర్వహించుకోవాలనే విషయంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే ఈ నెల 22, 23 రెండు రోజులు అమావాస్య రావడంతో చవితి ఏ రోజు అనేది అర్థం కావడం లేదు. దీంతో భాద్రపద శుక్ల చవితి ఈ నెల 27న అని, ఆ రోజే వినాయక చవితి జరుపుకోవాలని షాద్‌నగర్‌లోని వేద పండితులు క్లారిటీ ఇచ్చారు. వినాయక పూజ చేసుకోవడానికి ఉ.11:05 నుంచి మ.1:40 వరకు మంచి ముహూర్తం అన్నారు. నిమజ్జనం సెప్టెంబర్ 6న చేయాలన్నారు.

News August 26, 2025

శివభక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన సజ్జనార్‌

image

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ‘X’లో పోస్ట్‌చేశారు. ఎయిర్‌పోర్టు బోర్డింగ్‌ పాయింట్‌ నుంచి నేరుగా శ్రీశైలానికి బయలుదేరవచ్చని పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సజ్జనార్ కోరారు.

News August 26, 2025

HYD: దసరా, దీపావళి, ఛట్ పూజ వేళ ప్రత్యేక రైళ్లు: SCR

image

దసరా, దీపావళి, ఛట్‌ పూజ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మొత్తం 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు SCR ప్రకటించింది. ఈ రైళ్లు SEP 4 నుంచి అక్టోబర్ 10 వరకు సేవలు అందిస్తాయని తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-నాగర్‌సోల్, సంత్రగాచి-చర్లపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్-తిరుపతి రైలు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

News August 25, 2025

హైదరాబాదు నుంచి సరికొత్త టూర్ ప్లాన్స్

image

HYD నుంచి టూర్ వెళ్లాలనుకునే వారికి తెలంగాణ టూరిజం శాఖ కొత్త ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. నగరం నుంచి అరుణాచలం, బెంగళూరు, అన్నవరం ప్రాంతాలకు వెళ్లడానికి వేర్వేరుగా బస్సులను నడుపుతోంది. బెంగళూరు టూర్ 2 రోజులు, అరుణాచలం టూర్ 3 రోజులు, అన్నవరం ట్రిప్ 4 రోజులు ఉండనుంది. పూర్తి వివరాలకు 98485 40371,98481 25947, 98480 07020 నంబర్లకు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు.

News August 25, 2025

గణేశ్ నిమజ్జనానికి GHMC భారీ ఏర్పాట్లు

image

హుస్సేన్‌సాగర్‌తో సహా HYDలోని 66 చెరువులు, కుంటల్లో GHMC నిమజ్జనానికి ఏర్పాట్లు చేసింది. 41 కృత్రిమ పాయింట్లను ఏర్పాటు చేసింది. 3.10 లక్షల మట్టి గణేశ్ విగ్రహాలు పంపిణీ చేయనుంది. నిమజ్జనానికి 140 స్టాటిక్, 295 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. 160 గణేశ్ యాక్షన్ టీమ్‌లు, 14,486 పారిశుద్ధ్య కార్మికులు రంగంలోకి దిగనున్నారు. 13 కంట్రోల్ రూములు, 309 మొబైల్ టాయిలెట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.