India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీసీఏ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల మూడవ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఎం ఫార్మసీ (పీసీఐ) మొదటి, రెండు, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లిలో శుభాభినందనలు తెలిపారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి లక్ష్యంపైనే గురిపెట్టాలని పేర్కొన్నారు.
విద్యారంగం ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని HYD ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ నల్లగుట్ట బాలంరాయి హైస్కూల్లో ఎఫ్ఎల్ఎన్, ఏఎక్సెల్ ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లను కలెక్టర్‌తో కలసి పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, DEO ఉన్నారు.
మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా బేగంపేటలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మధ్యాహ్నం 12:00 గంటలకు హోటల్ టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ –2025 ప్రీ-లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంప్రదాయంలో చీర కట్టు, బొట్టు పెట్టుకొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ‘నమస్తే ఇండియా’ అని పలకరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక్కడి ట్రెడిషన్ చాలా బాగా నచ్చింది అంటూ కితాబిచ్చారు.
ఓయూలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. నిరసనలు నిషేధం అన్న సర్క్యూలర్ అగ్గిరాజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో లేని ఆంక్షలు ఇప్పుడు పెట్టడం ఏంటని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వామపక్షాలు నేడు బంద్‌కు పిలుపునివ్వడంతో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. ఇది నిబంధన కాదు నిర్బంధం అంటూ గొంతెత్తారు. వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇక అధికారులూ బెట్టు వీడకపోవడంతో పోలీసులు రంగప్రవేశం తప్పడం లేదు. దీనిపై మీ కామెంట్?
ATMలో ఓ వ్యక్తి చేసిన పాడు పని ఆలస్యంగా వెలుగుచూసింది. పంజాగుట్ట PS పరిధి రాజ్‌భవన్ రోడ్డు RBL ATM పనిచేయడం లేదని సిబ్బంది తనిఖీ చేశారు. సెన్సార్ పనిచేయడం లేదని గుర్తించి, సీసీ టీవీ పరిశీలించగా కంగుతిన్నారు. ఈ నెల 10వ తేదీన రాత్రి ఓ యువకుడు డబ్బులు డ్రా చేశాడు. అనంతరం ATM మిషన్ పక్కనే మూత్రవిసర్జన చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సమ్మర్ ఎఫెక్ట్‌తో నగరవాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. గురువారం ఉ. అమీర్‌పేట స్టేషన్‌కు ప్రయాణికులు క్యూ కట్టారు. ప్లాట్‌ఫాం పూర్తిగా నిండిపోయింది. రాయదుర్గ్ రూట్లో వెళ్లేవారికి నిరీక్షణ తప్పలేదు. ట్రైయిన్‌లో కిక్కిరిసి ప్రయాణించారు. డ్యూటీకి వెళ్లేవారు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా అయితే ఎలా పోవాలి అయ్యా ఆఫీస్‌కి అంటూ ఓ నెటిజన్ @ltmhydని ప్రశ్నించారు. ఇకనైనా సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.
HYDలో OYOకు డిమాండ్ పెరిగింది. ఇటీవల సర్వేలోనూ నిజమని తేలింది. పాతబస్తీ గల్లీల నుంచి ORR వరకు ఓయోలే దర్శనమిస్తున్నాయి. చిన్న.. చిన్న లాడ్జీలను సైతం ఆన్లైన్లో పెడుతున్నారు. రూ.500కే గదులను అద్దెకు ఇవ్వడంతో జనం క్యూ కడుతున్నారు. హోటళ్లు, గదులను లగ్జరీగా డిజైన్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చిల్ అవ్వాలని యువతను ఆకర్శిస్తున్నారు. దీంతో HYDలో OYO కొత్తపుంతలు తొక్కుతోంది.
మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా నగరంలో నేడు సందడి చేయనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ –2025 ప్రీ-లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరుకానున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మే 7 నుంచి ప్రారంభమయ్యే అందాల పోటీ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించనున్నారు. మంగళవారం ఆమె చీరకట్టులో యాదాద్రి స్వామిని దర్శించుకొన్న ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.