India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD, రంగారెడ్డి శివారులో అనేక చోట్ల రెడీమిక్స్ ప్లాంట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా HYDలోనే అత్యధిక సిమెంట్ వాడుతున్నట్లు సివిల్ ఇంజినీరింగ్ టెక్నికల్ యంత్రాంగం గుర్తించింది. అయితే.. థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా విడుదలవుతున్న ఫ్లైయాష్‌ను సిమెంట్ పరిశ్రమలు తక్కువగా వినియోగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణశాఖ, అటవీశాఖ సహాయక మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్డించారు.
మహానగర రోడ్లపై ఎటుచూసినా వాహనాలే.. పాదచారులు రోడ్డు దాటుదామంటే నరకమే..అందుకే గ్రేటర్ వ్యాప్తంగా 32 ఫుట్ ఓవర్ బ్రిడ్జి(FOB)లను గతంలో నిర్మించారు. అయితే నిర్వహణ మాత్రం గాలికొదిలేశారు. ఇపుడు వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని GHMC నిర్ణయించింది. FOBల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. ఇవి అందుబాటులోకి వస్తే నగరంలో పాదచారి కష్టాలు కాస్త తీరినట్టే.
వినాయక చవితి వేడుకలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడో రోజు 29 నుంచి నిమజ్జన సందడి మొదలు కానుంది. అందుకే నగరంలో రోడ్లకు మరమ్మతు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఈ మరమ్మతులు ఈ నెల 25వ తేదీ లోపు పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మహానగరంలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతుండటంతో మరోసారి శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని గ్రేటర్ అధికారులు నిర్ణయించారు. జులై 29 నుంచి ఆగస్టు 8 వరకు ఈ డ్రైవ్ నిర్వహించారు. భారీ వర్షాలు రావడంతో నగరంలో చెత్త సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. గతంలో చేపట్టిన డ్రైవ్ సక్సెస్ కావడంతో నేటి నుంచి ఈనెల 25 వరకు గ్రేటర్ వ్యాప్తంగా చెత్త తొలగించి, తరలించాలని గ్రేటర్ బాస్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.
మీది జూబ్లిహిల్స్ నియోజకవర్గమా? మీకు 18 సంవత్సరాలు నిండాయా.. ఓటరు జాబితాలో మీ పేరు లేదా? అయితే ఇది మీకోసమే. త్వరలో మీ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగబోతున్నాయి తెలుసా? ఓటు అనే ఆయధంతో మీ నిర్ణయాన్ని చెప్పే అవకాశం ఇపుడు మీకు వచ్చింది. వచ్చే నెల 2 నుంచి 17వ తేదీ వరకు ఎన్నికల అధికారులు ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టనున్నారు. జాబితాలో మీ పేరు నమోదు చేసుకొని వచ్చే ఎన్నికల్లో ఓటు వేయండి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. దీనికి ఓటరు జాబితా రూపకల్పనలో గ్రేటర్ అధికారులు చురుగ్గా పనిచేస్తున్నారు. ఓటరు జాబితాలో సవరణలను సెప్టెంబరు 2 నుంచి 17 వరకు మధ్య చేపట్టనున్నట్లు గ్రేటర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. 30వ తేదీ ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తామన్నారు. ఇందుకు రాజకీయ పార్టీల నాయకులు కూడా సహకరించి సలహాలు అందజేసి సందేహాలు నివృత్తి చేసుకోవాలని కోరారు.
30% వేతనాలు పెంచాలని సినీ కార్మికులకు చేస్తున్న సమ్మె 18వ రోజుకు చేరింది. అయినా సినీ పెద్దల నుంచి పెద్దగా స్పందన రావడం లేదని వారు చెబుతున్నారు. ఏ రోజుకారోజు వచ్చే వేతనం మీద ఆధారపడేవాళ్లమే ఎక్కువగా ఉన్నామని వాపోతున్నారు. ఫిలింఛాంబర్ పెద్దలు కేవలం 15% పెంచుతామని.. అదీ 3 విడతల్లో ఇస్తామని చెబుతున్నారు. ఇందుకు నాయకులు ఒప్పుకోవడం లేదు. తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని కష్టజీవులు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును బురిడీ కొట్టించి 59 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఉద్యోగం పొందారు. తప్పుడు బోనఫైడ్ సర్టిఫికేట్లతో ఉద్యోగాల్లో చేరారు. ఆ 59 మంది నకిలీ పత్రాలపై సీసీఎస్లో పోలీస్‌శాఖ ఫిర్యాదు చేసింది. ఇప్పటికే AR, సివిల్ కానిస్టేబుల్స్గా వారు విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
కూకట్‌పల్లిలో సహస్రిని (11) హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. హత్యకు సంబంధించి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివిధ బృందాలుగా ఏర్పడి క్షుణ్ణంగా నిందితుడి కోసం జల్లెడ పడుతున్నారు. భవనంలో ఉంటున్నవారిని, స్థానికులను, బంధువులను ప్రశ్నించారు. నిందితులకు సంబంధించి పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వటం లేదు. దర్యాప్తు వేగంగా జరుగుతోందని, వివరాలు అనంతరం వెల్లడిస్తామని మాత్రమే చెబుతున్నారు.
రాజీవ్ స్వగృహలో అసంపూర్తి భవనాలను ప్రభుత్వం రూ.70.11 కోట్లకు విక్రయించింది. పోచారం టౌన్‌షిప్‌లో 2 టవర్లను, గాజులరామారంలోని 112 ఫ్లాట్‌లు ఉన్న ఒక టవర్‌ను లాటరీ ద్వారా కేటాయించారు. పోచారంలో టవర్‌ను ఎన్‌టీపీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్‌కు రూ.13.78 కోట్లకు, మరో టవర్‌ను గాయత్రీ ఎడ్యుకేషన్ ట్రస్టుకు రూ.30 కోట్లకు కేటాయించారు. గాజులరామారం టవర్‌ను ఎఫ్‌సీఐ ఎంప్లాయిస్ అసోసియేషన్‌కు కేటాయించారు.
Sorry, no posts matched your criteria.