India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థులకు నిరంతర అభ్యాసం అవసరమని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరగలరని విజ్ఞాన్స్ విద్యాసంస్థల ఛైర్మన్ డా.లావు రత్తయ్య తెలిపారు. విద్యార్థుల్లో చదువు, అభివృద్ధి అనేది సంతోషంగా జరగాల్సిన ప్రక్రియని చెప్పారు. సోమవారం బీటెక్ 1st ఇయర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులందికీ అభినందనలు తెలిపారు.
కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో జరిగిన <<17442408>>బాలిక హత్య<<>> కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం.. శరీరం మీద 9 కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. హత్య జరిగిన ఇంట్లోని కత్తుల్లో ఒకటి కనిపించకుండా పోయింది. ఈ హత్య దాదాపు 10 నుంచి 11 గంటల మధ్య జరిగి ఉంటుందని వారు తెలిపారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో HYD- తిరుపతి అలియాన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 67 మంది ప్రయాణికులు బోర్డింగ్ అయిన తర్వాత సాంకేతిక లోపాన్నీ పైలెట్ గుర్తించారు. తిరిగి ప్రయాణికులను దింపేసి సాంకేతిక లోపాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. కాగా.. తిరుపతి వెళ్లాల్సిన 67 మంది ప్రయాణికులు హోల్డింగ్‌లొనే ఉన్నారు.
ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఇవాళ 84వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు VC ప్రొ. కుమార్ మొలుగరం తెలిపారు. ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఛాన్సిలర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో ఛైర్మన్ డా.నారాయణన్ హాజరుకానున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గౌరవ డాక్టరేట్‌ను ఇస్రో ఛైర్మన్‌కు ఇవ్వాలని వర్సిటీ పాలకమండలి నిర్ణయించింది. ఇప్పటికే 49 మంది ప్రముఖులను డాక్టరేట్లతో ఓయూ సత్కరించింది.
జిమ్ చేసే యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా మెఫెంటర్‌మైన్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న నలుగురిని HNEW, చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో పాన్‌షాపు యజమాని, ఇద్దరు ఫార్మసీ ఉద్యోగులు, మెడికల్ షాపు యజమాని ఉన్నారు. ఈ ఇంజెక్షన్లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడటం ఆరోగ్యానికి హానికరమని, అక్రమ విక్రయాలపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకొన్న ఉస్మానియాకు 20 ఏళ్ల తర్వాత ఓ CM వస్తున్నారు. సమైఖ్య పాలనలో 9 ఏళ్లు, స్వరాష్ట్రం ఏర్పాటైన 11 ఏళ్లలో ముఖ్యమంత్రి హోదాలో ఎవరూ రాలేదన్న విమర్శలున్నాయి. తాజాగా OU VC రేవంత్‌ను క్యాంపస్‌కు ఆహ్వానించారు. CM ఓకే అనడంతో AUG 21న షెడ్యూల్ ఖరారైంది. హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం, డిజిటల్ లైబ్రరీకి శంకుస్థాపన చేస్తారు. విద్యార్థులతో CM సంభాషణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ VCకి ఓ విద్యార్థిని వినూత్న విన్నపం పంపింది. హయత్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థిని ఎంఏ (ఎకనామిక్స్) అడ్మిషన్ తెలుగు మీడియంలో తీసుకుంది. ఇటీవల జరిగిన పరీక్షలో సమాధానాలను ఆమె తెలుగులో కాకుండా ఇంగ్లిషులో రాసింది. సిలబస్ ప్రకారమే తాను పరీక్ష రాశానని, తెలుగులో కాకుండా ఇంగ్లిష్ రాశానని, తన పేపరును వాల్యూయేషన్ చేయాలని వీసీని ట్విట్టర్‌లో కోరింది.
వినాయకచవితి వేడుకలు ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించేందుకు భాగ్యనగర ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది. మండపాల వద్ద, నిమజ్జనం సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన సూచనలు, సలహాలు ఇస్తోంది. ఈ సంవత్సరం గ్రేటర్ వ్యాప్తంగా లక్షా 40వేల విగ్రహాలకు పైగా ప్రతిష్ఠించే అవకాశముందని భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ పేర్కొన్నారు.
ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాల వల్ల నగరవాసి తాగునీటికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. వచ్చే సంవత్సరం వేసవికాలం వరకు నీటి సమస్య ఉత్పన్నం కాదు. సిటీకి తాగునీటిని సరఫరా చేసే నాగార్జునసాగర్, మంజీరా, శ్రీపాద ఎల్లమ్మ, సింగూరు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు నీటితో కళకళలాడుతూ ఉండటంతో జలమండలి అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా ఈ నగరాన్ని ఏపీలోని మచిలీపట్నం బందరు పోర్టుకు అనుసంధానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఓడరేవుతో అనుసంధానం చేయడం వల్ల నేషనల్, ఇంటర్నేషనల్ వాణిజ్య రవాణాకు అవకాశాలుంటాయి. అలా అయితే దేశ, విదేశాల్లోని కార్పొరేట్ పెట్టుబడులను ఆకర్షించవచ్చనేది ప్రభుత్వ పెద్దల ఆలోచన. ఇందులో భాగంగానే ఇందుకు సంబంధించిన ప్రత్యేక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.