Hyderabad

News March 26, 2025

ఎల్బీనగర్‌లో మర్డర్.. నిందితుల అరెస్ట్

image

LBనగర్ శివగంగకాలనీలో మార్చి 23న పాతకక్షలతో మహేశ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పురుషోత్తం, నాగార్జున, సందీప్, రాము, రాజరాకేశ్, కుంచల ఓంకార్‌ నిందితులుగా ఉన్నారు. వీరి నుంచి ఫోన్‌లు, బైకు, కారు, గొడ్డలి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు CI వినోద్ కుమార్ తెలిపారు.

News March 26, 2025

రేపు ఉప్పల్ వెళుతున్నారా.. ఇది మీ కోసమే!

image

రేపు ఉప్పల్ వేదికగా SRH VS LSG మ్యాచ్ కోసం TGSRTC స్పెషల్ బస్సులను నడుపుతోంది. 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను స్టేడియానికి తిప్పనున్నారు. ఉప్పల్, చెంగిచెర్ల, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మిధాని, బర్కత్‌పురా, కాచిగూడ, ముషీరాబాద్, దిల్‌సుఖ్‌నగర్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, మేడ్చల్, మియాపూర్, కంటోన్మెంట్, హఫీజ్‌పేట, రాణిగంజ్, ఫలక్‌నుమా, మెహదీపట్నం, HCU తదితర డిపోల బస్‌లు అందుబాటులో ఉంటాయి.
SHARE IT

News March 26, 2025

చేనేత కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఇందిర తెలిపారు. ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7- 2025 సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులను ప్రదానం చేయడానికి అర్హతలతో దరఖాస్తులు కోరుతోందిని వివరించారు. ఏప్రిల్ 15లోపు చేనేత నుంచి HYDలోని చేనేత జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

News March 26, 2025

HYD: అమ్మానాన్న సారీ.. స్టేటస్ పెట్టి SUICIDE

image

మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో సోమేశ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సోదరి వివాహం కోసం దాచిన డబ్బులతో పాటు సోమవారం జరిగిన IPLలో ఒక్కరోజే లక్ష పోగొట్టుకున్నాడు. దీంతో అతడు.. ‘నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడయ్యా. డబ్బుల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు. నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మానాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సారీ’ అని స్టేటస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 26, 2025

గ్రేటర్‌లో స్ట్రీట్ లైట్లకు త్వరలో యాప్

image

గ్రేటర్‌ హైదరాబాద్‏లోని పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొందన్న ఫిర్యాదులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. వీటి మెరుగైన నిర్వహణకు సాంకేతికత వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కమిషనర్‌ ఇలంబర్తి తెలిపారు.

News March 26, 2025

సికింద్రాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

సికింద్రాబాద్ మహంకాళి PS పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం.. వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. స్పాట్ వద్ద సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

News March 26, 2025

HYDలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. RAIDS

image

HYDలో వ్యభిచార ముఠాలకు పోలీసులు చెక్ పెట్టారు. మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌‌లో బంగ్లా యువతితో వ్యభిచారం చేయించడం గుర్తించారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన కార్తీక్, ఓ కస్టమర్‌, యువతిని అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్‌లో ఫొటోలు పంపి కస్టమర్లను ఆకర్శిస్తున్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోనూ ఉగాండా యువతితో వ్యభిచారం చేయిస్తూ మరో వ్యక్తి పట్టుబడ్డాడు.

News March 26, 2025

రూ.2 కోట్లు.. సచివాలయం చెల్లించాల్సిన ఆస్తి పన్ను

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయాన్ని ఘనంగా, గొప్పగా నిర్మించిన ప్రభుత్వం ఆ భవనానికి సంబంధించి ఆస్తి పన్ను ఇంకా చెల్లించలేదు. మహానగర వ్యాప్తంగా ఆస్తిపన్ను వసూలు చేస్తున్న అధికారులకు పెండింగ్ బిల్లు జాబితాలో రాష్ట్ర సచివాలయం కనిపించింది. దాదాపు రూ.2 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. మార్చి 31లోపు ఈ మొత్తాన్ని ఎలా రాబట్టాలని గ్రేటర్ అధికారులు చర్చలు జరుపుతున్నారు.

News March 26, 2025

భారీ శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధం

image

భారీ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. APR 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాంబాగ్‌ ఆలయం నుంచి హనుమాన్‌ వ్యాయామశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఇటీవల ఈ రూట్‌ను గోషామహల్‌ MLA రాజాసింగ్ పరిశీలించారు. ఈ సారి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వేలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొని రాముడి విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీరామనవమి రోజు ‘జై శ్రీరామ్’ నినాదాలతో HYD హోరెత్తనుంది.

News March 26, 2025

HYD: గ్రేట్.. చనిపోతూ ఏడుగురిని కాపాడాడు!

image

తాను చనిపోతూ ఏడుగురికి ప్రాణం పోశాడు ఓ యువకుడు. ఎల్బీనగర్‌లో నివాసం ఉండే శ్రీ అశ్లేశ్ గురునానక్ కాలేజీ‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. మైగ్రేన్, ఫిట్స్‌తో మార్చి 21 అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించగా మార్చి 23న అతడి బ్రెయిన్ డెడ్ అయ్యింది. తల్లిదండ్రులు శివశంకర్, ప్రమీల రాణి కుమారుడి అవయవదానానికి ఒప్పుకున్నారు. దీంతో జీవన్‌దాన్ ద్వారా ఏడుగురి ప్రాణాలు కాపాడారు.

error: Content is protected !!