India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరంలో వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు GHMC రోడ్ల పరిసరాల్లో సంపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. PVNR పిల్లర్ నంబర్-264, నేతాజీ నగర్, రంగ మహల్ జంక్షన్, సోమాజిగూడ ఇమేజ్ ఆసుపత్రి, సోమాజిగూడ జోయ్ ఆలుకాస్, రాజీవ్ గాంధీ విగ్రహం, లక్డీకపూల్ ద్వారక హోటల్, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్, అయ్యప్ప సోసైటీ చెక్ పోస్ట్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఓల్డ్ కేసీపీ ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు.
కరోనా కష్టకాలంలో రోగులకు సేవలందించిన గాంధీ మెడికల్ కాలేజీ, సనత్ నగర్ ఈఎస్ఐసీ ఆస్పత్రులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రశంసలతో ముంచెత్తింది. గురువారం ఢిల్లీ క్లినికల్ రిజిస్ట్రీ ఫర్ కొవిడ్-19 రిపోర్టు రిలీజ్ అండ్ డిస్సెమినేషన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు, ప్రొఫెసర్ త్రిలోక్ చందర్‌ను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.
బాలాపూర్‌లో బీటెక్ స్టూడెంట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో పక్కా ప్లాన్ చేసి మరీ ప్రశాంత్‌ని హత్య చేసినట్లు గుర్తించారు. హంతకులు అంతా ఒకే బస్తీకి చెందిన వారు అని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో దొరికిన సీసీ ఫుటేజ్ ద్వారా మూడు గంటల్లో నిందితులకు చెక్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
విపత్తుల సమయంలో బాధితులకు సాయం అందించడం సవాళ్లతో కూడుకున్న పని, చాలాసార్లు హెలికాప్టర్ వెళ్లలేని ప్రాంతాలు సైతం ఉంటాయి. ఇలాంటి పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఐఐటీ హైదరాబాద్ చేపట్టిన డ్రోన్ల తయారీ ప్రాజెక్టు తుది దశకు చేరింది. ఇప్పటికే 60 కిలోల బరువు తీసుకువెళ్లే డ్రోన్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా 100 కిలోల బరువును అవలీలగా తరలించే ప్రాజెక్టు ప్రయోగ దశలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ (మంకీపాక్స్) అలజడి రేకెత్తిస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రులను సిద్ధం చేసింది. అక్కడ ప్రత్యేక వార్డులు నెలకొల్పింది. గాంధీలో 20 పడకలు కేటాయించారు. ఇందులో పురుషులకు, మహిళలకు పదేసి పడకలు కేటాయించినట్లు గాంధీ వైద్యులు పేర్కొన్నారు. ఫీవర్ ఆసుపత్రిలో ఆరు పడకలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి తన భూమికి సంబంధించి ధరణి సమస్య పరిష్కారం కాకపోవడంతో తలకిందులుగా నిరసన చేశాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితుడు చేసిన పనికి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, కార్యాలయ అధికారులు అవాక్కయ్యారు.
కోఠి ENT ఆసుపత్రిలో వినికిడి సమస్య సంబంధించిన సర్జరీలు ఇటీవల పెద్ద సంఖ్యలో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఖరీదైన వినికిడి యంత్రాలు, సర్జరీలు చేయించుకున్న వారికి LOC, CMRF ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. చికిత్సల అనంతరం ఉచితంగా వినికిడి యంత్రాలతో పాటు, ఏడాది పాటు AVT( Auditions Verbal Therapy) అందిస్తారు.
HYD బాలాపూర్ PS పరిధిలో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రౌడీషీటర్ రియాజ్ హత్య మరువక ముందే మరో యువకుడిని గుర్తు తెలియని దుండగులు వెంటపడి మరీ కత్తులతో పొడిచి హత్య చేశారు. బాలాపూర్ గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ హోటల్ ఎదుట జనం చూస్తుండగానే హత్య జరిగింది. మృతుడి ఎంవీఎస్ఆర్ మాజీ స్టూడెంట్ ప్రశాంత్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి DCP సునీతారెడ్డి చేరుకుని, కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
HYDలో కాలుష్యం పెరుగుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ‘స్టేటస్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్’ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2000 నుంచి 2019 వరకు నగరంలో పీఎం 2.5 వంటి సూక్ష్మదూళి కణాల ఉద్గారాలతో అనేక మంది శ్వాసకోశ సంబంధ సమస్యల బారిన పడి మరణించినట్లు వెల్లడించింది. 2000 నాటికి కాలుష్యం బారిన పడి 2,810 మంది, 2019 నాటికి 6,460 మంది మరణించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్‌లో మాత్రమే ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సు ఉంది. దీనిలో చేరడానికి పదో తరగతి పాసై తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే పాలిసెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే చాలు. HYDలో జూ పార్క్ సమీపంలోని కులీ కుతుబ్షా (QQ) గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే ఈ కోర్సు బోధిస్తున్నారని, విద్యార్థులు మెరుగైన ఉపాధి పొందుతున్నట్లు లెక్చరర్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.