Hyderabad

News August 6, 2025

HYD: భారం నీదే వి‘నాయక’!

image

‘ఇంకా 20 రోజులే ఉంది.. ఏం చేద్దాం బ్రో?’ అని బస్తీలో చర్చ మొదలైంది. సిటీలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ కదా! ఆ మాత్రం హడావిడి ఉంటది. ఈసారి వినాయకచవితికి హైదరాబాదీ ఆరాటం అంతా ఇంతా కాదు. ‘ఖైరతాబాద్‌‌లో మహాగణపతి కొలువుదీరుతుండు. బాలాపూర్ విగ్రహం, మండపం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఇక గల్లీలో మనం తగ్గొద్దు. కర్రపూజకు నాయకులను పిలుద్దాం. ఖర్చు ఎంతైనా వి‘నాయకుడి’ మీదే భారం అంటూ యువత నవరాత్రులకు సిద్ధమవుతోంది.

News August 6, 2025

మూసారాంబాగ్ మొర వినరా?

image

ఓ వైపు జంటజలాశయాలు నిండుతున్నాయి. హిమాయత్‌సాగర్‌‌ గేట్లు ఎత్తే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షాలకు మూసీ ఉప్పొంగితే మూసారాంబాగ్‌‌లో ప్రజల అష్టకష్టాలు తెలిసిందే. వరదల నుంచి గట్టెక్కించే హైలెవల్ బ్రిడ్జి పనులు అటకెక్కాయని వాహనదారులు వాపోతున్నారు. అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లాలంటే ఊరంతా తిరిగి వెళ్లాల్సి వస్తోందని, ఇకనైనా బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మొరపెట్టుకుంటున్నారు.

News August 6, 2025

HYD: మహాబోధిలో ‘చివరి మజిలీ’

image

గద్దర్ చివరి రోజులు మొత్తం నగరంలో‌నే గడిపారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023 AUG 6న తుదిశ్వాస విడిచారు. పుట్టింది మెదక్‌ జిల్లా తూప్రాన్‌ అయినా ఆయన పెరిగింది సిటీలోనే. గద్దర్ కోరిక మేరకు ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు చేశారు. నగర వీధుల్లో జోహార్ గద్దర్ అంటూ ‘చివరి మజిలీ’ కళాకారులు, అభిమానుల గుండెలను తడిపింది.
నేడు గద్దర్ వర్ధంతి.

News August 6, 2025

HYDలో ఆగస్టు 15, 16న బీఫ్ షాపులు, కబేళాల బంద్

image

స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15, శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 16 సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని బీఫ్ దుకాణాలు, పశువుల కబేళాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ చట్టం-1955 ప్రకారం సెక్షన్ 533(b) కింద ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ప్రజాభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు GHMC పేర్కొంది. ఈ ఆదేశాల అమలులో పోలీసు శాఖ పూర్తి సహకారం అందించాలని కమిషనర్ RV కర్ణన్ కోరారు.

News August 6, 2025

HYD: మనుషులమని మరిస్తే ఎలా బాస్!

image

శాలిబండ పరిధిలోని చందూలాల్ బేళా రోడ్‌లో బహిరంగ మూత్ర విసర్జన అక్కడివారికి తీవ్ర అసౌకర్యాన్ని కలగిస్తోంది. 200 మీటర్ల పరిధిలో పబ్లిక్ లైబ్రరీ, పాఠశాలలు ఉండడంతో యువతులు, పిల్లలు రోజూ ఈ దారిలో ఇబ్బంది పడుతూ వెళ్తున్నట్లు వాపోయారు. GHMC నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ బల్క్ డంపింగ్ యార్డును ఇక్కడినుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. మనం మనుషులం అని మరిచి ప్రవర్తిస్తే ఎలా అని మండిపుడుతన్నారు.

News August 6, 2025

బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయానికి విజయ్ దేవరకొండ

image

బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో నటుడు విజయ్ దేవరకొండ నేడు బషీర్‌బాగ్ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే నటుడు ప్రకాశ్‌రాజ్‌ను విచారించగా.. మళ్లీ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయనని ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు రానాకు ఆగస్టు 11న, మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ నీటీసులు జారీ చేసింది.

News August 6, 2025

AP యువతులతో HYDలో వ్యభిచారం

image

మేడిపల్లి PS పరిధిలోని ద్వారకానగర్‌లో ఉండే స్వప్న బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. భర్త చనిపోయి ఆర్థిక ఇబ్బందులతో ఈజీ మనీ కోసం తెలిసినవారు నవీన్, అశోక్‌లతో కలిసి ఏపీ యువతులను రప్పించి వ్యభిచార గృహం నిర్వహిస్తోందని పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో SI నర్సింగ్‌రావు సిబ్బందితో కలిసి దాడి చేసి ఇద్దరు యువతులు, ఓ విటుడు, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. 3 సెల్‌ఫోన్లు, రూ.1200 స్వాధీనం చేసుకున్నారు.

News August 6, 2025

HYD: పోలీసు కార్యాలయాల్లో పాత వస్తువుల వేలం

image

హైదరాబాద్ సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, పెట్లబుర్జు కార్యాలయంలోని పాత వస్తువులు వేలం వేయనున్నారు. ఈనెల 7వ తేది ఉ.11 గంటలకు వేలం వేస్తున్నట్లు DCP రక్షిత కృష్ణమూర్తి ప్రకటించారు. ఈ వేలంలో పాత ఐరన్, ఏసీలు, టెంట్, చెక్క కుర్చీలు, ఫర్నిచర్స్, హెల్మెట్స్, ఎయిర్‌కూలర్లు, ప్లాస్టిక్ కుర్చీలు వేలం వేయనున్నారు. ఆసక్తి గలవారు CI రవి 8712661326ని సంప్రదించాలన్నారు.

News August 6, 2025

ఓయూ: బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల పరీక్షల తేదీల ఖరారు

image

ఓయూ పరిధిలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను ఈనెల 12వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

News August 6, 2025

ఆ ఆసుపత్రులపై చర్యలు తీసుకోండి: హైదరాబాద్ కలెక్టర్

image

హైదరాబాద్ జిల్లాలో అనుమతి లేని ఆసుపత్రులను గుర్తించి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిచందన వైద్యాధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రిజిస్టరింగ్ అథారిటీ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ కదిరవన్ పళని, DCP డా.లావణ్యతో కలిసి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు.