India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా సమస్యల అర్జీలపై సత్వరమే అధికారులు స్పందించాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కదిరవన్ పళనితో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, పరిష్కరించాలన్నారు.
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా చంద్రారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కొంగరకలాన్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్‌కి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించగా, ప్రస్తుతం ప్రతిమా సింగ్ మెటర్నిటీ సెలవుల్లో ఉండడంతో చంద్రారెడ్డిని జిల్లా అదనపు కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు.
HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని విభాగాల బీఈ ఎనిమిదో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో సోమవారం భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించడంతో జీహెచ్‌ఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సహాయం పొందేందుకు 040-21111111, 9000113667 నంబర్లకు కాల్ చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు.
హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. హైడ్రా ప్రజావాణికి 58 ఫిర్యాదులు అందాయన్నారు. పార్కుల కబ్జాలు, రహదారుల ఆక్రమణలు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కాజేసే ప్రయత్నాలపై ఫిర్యాదులు అందాయన్నారు. లే ఔట్‌నే ప్రామాణికంగా తీసుకొని స్థలాలను పరిరక్షిస్తామన్నారు.
బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో చేరేందుకు మొదటి దశ సీట్లు కేటాయిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ సర్కులర్ విడుదల చేసింది. B.PEd, D.PEdలకు కన్వీనర్ కోటాలో మొత్తం 1,659 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 1,080 మంది వెబ్ ఆప్షన్ పెట్టుకోగా.. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 956 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించింది. ఈనెల 8లోగా ఆన్‌లైన్లో ఫీజు చెల్లించి, ఒరిజినల్ సర్టిఫికెట్లతో కేటాయించిన కళాశాలలో అందజేయాలన్నారు.
హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా ప్రజలు మ్యాన్ హోల్స్ మూతలు తెరవొద్దని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) శనివారం హెచ్చరించింది. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో ఈ హెచ్చరికను జారీ చేసింది. పరిస్థితి నిర్వహణకు అత్యవసర ప్రతిస్పందన బృందాలను అధికారులు రంగంలోకి దించారు. మూడు రోజులపాటు నీటి నాణ్యత, ప్రజల భద్రతను నిరంతరం పర్యవేక్షించనున్నారు.
HYD నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు GHMC,Google కలిసి AIఆధారిత పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా చాట్బాట్‌లు, AIసెర్చ్ టూల్స్, బ్లాక్‌చెయిన్ ధ్రువీకరణ, స్మార్ట్ పార్కింగ్, వ్యర్థాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి సాంకేతిక పరిష్కారాలను తీసుకొస్తారు. Google మ్యాప్స్‌తో బస్సుల లైవ్ ట్రాకింగ్, ఆరోగ్య విశ్లేషణ, వ్యాధుల గుర్తింపు వంటి సేవలు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు.
బాలికతో పరిచయం సహజీవనం వరకు వెళ్లింది. ఈ ఘటన HYD మేడిపల్లి PSపరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ తల్లి తన బావకు పిల్లలు లేరని బాలిక(17)ను దత్తతగా ఇచ్చింది. పెంపుడు తల్లి క్యాన్సర్‌తో చనిపోగా బాలిక చదువు మానేసింది. ఈలోగా స్నాప్‌చాట్‌లో అలియాబాద్ వాసి రవితేజ(23)తో బాలికకు పరిచయం ఏర్పడగా 2 నెలలుగా సహజీవనం చేస్తోంది. తల్లికి విషయం తెలిసి PSలో ఫిర్యాదు చేయగా యువకుడిని రిమాండ్‌కు తరలించారు.
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం 44 సబ్జెక్టులకు రాష్ట్ర స్థాయి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్(TG CP GET) నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి రోజూ మూడు సెషన్లలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. సోమవారం 7 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 7,643 మంది అభ్యర్థులకు 6,491(84.93%) మంది హాజరైనట్లు ఉస్మానియా యూనివర్సిటీ సర్కులర్ విడుదల చేసింది.
Sorry, no posts matched your criteria.