India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో BLISC పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ వివిధ కారణాల రీత్యా వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్, స్టడీ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు.

ఓయూ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల మేకప్ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 26 లోపు నిర్వహించాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ తదితర కోర్సుల ఆరో సెమిస్టర్ ఇన్‌స్టెంట్/ మేకప్ ప్రాక్టికల్, ప్రాజెక్ట్, వైవా పరీక్షలను నిర్వహించి 26వ తేదీల్లోగా మార్కుల మెమోలను వెబ్‌సైట్లో అప్లోడ్ చేస్తామన్నారు.

GHMC కార్యాలయాల్లోకి మీడియా ఎంట్రీని వారానికి ఒక్కరోజే అనుమతించాలని స్టాండింగ్ కమిటీ తీర్మానించినట్లు తెలుస్తోంది. ముందు పూర్తిగా నిషేధించాలని భావించినా, చర్చల అనంతరం ఒక్కరోజుకు వెసులుబాటు కల్పించింది. దీంతో GHMC, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోకి మీడియాకు వారానికి ఒక్కరోజే అనుమతి ఉండనుంది. తమ విధులకు ఆటంకం కలగకుండా ఉండేందుకే దీనికి కారణంగా తెలుస్తోండగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కల్తీ కల్లు తాగి నిజాంపేట్‌లోని హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న <<17017648>>వి.సుగుణమ్మ(58)<<>>ను వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమెకు కూడా ఆ కళ్లు తాగడంతోనే వాంతులు విరోచనాలు కాగా కుటుంబ సభ్యులు నిజాంపేట్‌లోని ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. మెరుగైన వైద్యచికిత్సల కోసం నేడు 108 సిబ్బంది సతీశ్ శ్రీనివాస్, సహాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కూకట్‌పల్లిలో కల్తీ కల్లు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కూకట్‌పల్లిలో భాగ్యనగర్ కాలనీలోని కల్లు కాంపౌండ్, ఇంద్రహిల్స్‌లోని కల్లు కాంపౌండ్, హైదర్‌నగర్‌లో మరొక్క కల్లు కాంపౌండ్‌లో ఆదివారం తాగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిలో HMT హిల్స్‌కి చెందిన ఇద్దరు, హైదర్‌నగర్, శ్రీరామ్‌నగర్, మహంకాళి నగర్, సాయి చరణ్ కాలనీకి చెందిన వారు మృత్యువాత పడ్డారు. 30 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచానికే నూతన పాఠాలు చెబుతోంది. HYD ఆధారిత ఓ స్టార్ట్‌అప్, RR జిల్లా ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో iTrapper అనే ఆధునిక లైట్ ట్రాప్‌ను అభివృద్ధి చేసింది. ఇది రైతులను పింక్ బాల్ వార్మ్ వంటి ప్రమాదకర కీటకాల నుంచి రక్షించడంలో సహాయ పడుతుందన్నారు. గులాబీ తెగులును ఇట్టే పసిగట్టేస్తుంది.

ప్రియుడు, తల్లితో కలిసి కన్న తండ్రినే హతమార్చిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. ముషీరాబాద్- ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతుల పెద్ద కుమార్తె భర్తతో విడిపోయి వీరి వద్దే ఉంటుంది. మనీషా వివాహేతర సంబంధంపై తండ్రి హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా.. ఈనెల 5న ప్రియుడు మహ్మద్ జావీద్, తల్లితో కలిసి తండ్రిని చంపేసి శవాన్ని ఏదులాబాద్ చెరువులో పడేశారు.

హైదరాబాద్ నగరంలో కల్తీ కల్లు ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నిన్నటి వరకు ఐదుగురు మృతిచెందగా.. 31 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కూకట్‌పల్లి PS పరిధిలోని కల్లు కాంపౌండ్లలో మోతాదుకు మించిన కెమికల్స్ కలిపిన కల్లు తాగడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఎక్సైజ్ అధికారులు 5 కేసులు నమోదు చేశారు. కాగా కల్లు దుకాణాలపై నిఘా ఉంచాల్సిన అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో విమర్శలు వస్తున్నాయి.

పసుపు కుంకుమల సంగమాన్ని తలపించిన వీధులు.. వేద పండితుల మంత్రోచ్చరణలు, భాజా భజంత్రీలు.. శివసత్తుల నృత్యాలు వెరసి భక్త జన సందోహం నడుమ చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఛైర్మన్ ఆరెల్లి అంజయ్య దంపతులు, కుటుంబ సభ్యులు అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభంగా నిర్వహించారు. దాతలను ఆలయ కమిటీ ఛైర్మన్ అమ్మవారి శేష వస్త్రాలతో సత్కరించారు.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈనెల 14వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.