India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో KNR డివిజన్ పరిధిలోని మానకొండూర్ మండలం మినహా అన్ని మండలాలల పరిధిలోని గ్రామ పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలు సహా మానకొండూర్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత NOV 04, రెండో విడత NOV 08న ఎన్నికలు జరగనున్నాయి.

జిల్లాలో ZPTC, MPTC స్థానాలకు ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో HZB రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, శంకరపట్నం, వీణవంక, సైదాపూర్ మండలాలు, రెండో విడతలో KNR రెవెన్యూ డివిజన్ పరిధిలోని చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, గన్నేరువరం, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, మానకొండూర్, రామడుగు, తిమ్మాపూర్ మండలాల్లో జరగనున్నాయి. తొలి విడత OCT 23, రెండో విడత OCT 27న ఎన్నికలు.

కరీంనగర్ శ్రీమహాశక్తి దేవాలయాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దర్శించుకున్నారు. భవాని దీక్షలో ఉన్న బండి సంజయ్ దగ్గరుండి పాడి కౌశిక్ రెడ్డికి అమ్మవారి దర్శనం చేయించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆకాంక్షించినట్లు తెలిపారు.

దసరా పండగ సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. రామ్ లీలా మైదానాలు, దేవి నిమజ్జనం కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున దసరా, రామ్ లీలా కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు పాల్గొనే అవకాశం ఉన్నందున రాజకీయ అల్లర్లు జరగకుండా ముందువస్తు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు. పోలీస్ కమిషనరేట్‌లో ఈరోజు పోలీస్ అధికారులతో ఎన్నికల బందోబస్తుపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేల కంటే ఎక్కువ నగదును వెంట తీసుకెళ్లొద్దని ప్రజలకు సూచించారు.

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఈరోజు కిసాన్ నగర్ గర్రకుంటలో బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మను నిమజ్జనం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు, కార్మికులు ప్రశాంతంగా కార్యక్రమం జరిగేలా ఏర్పాట్లు చేశారు. సీఐ జాన్ రెడ్డి నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ జామ్, అవాంఛనీయ ఘటనలు లేకుండా బందోబస్తు చేపట్టారు.

కరీంనగర్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ శైలుకిరణ్ తాజా గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటారు. ఆమె గ్రూప్ 2లో డిప్యూటీ ఎంఆర్‌ఓ, గ్రూప్ 3లో సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికయ్యారు. ప్రిపరేషన్ సమయంలోనే తండ్రి కన్నుమూసినా.. పట్టుదలతో చదువును కొనసాగించి అన్నుకున్నది సాధించారు. శైలుకిరణ్ విజయం పట్ల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. అదే రోజు దసరా పండుగ ఉన్నప్పటికీ, గాంధీ జయంతి రోజున వధశాలల (స్లాటర్ హౌస్) కార్యకలాపాలు, మాంసం, మద్యం విక్రయించడం చట్టరీత్యా నిషేధం. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఈ నిషేధాన్ని పాటించి సహకరించాలని మున్సిపల్ అధికారులు కోరారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ఆలం, అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా కమిషనర్ ఆదేశించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని ఆమె సూచించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.