India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనధికార లే ఔట్ల క్రమబద్ధీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్ 25 శాతం రాయితీ సదుపాయాన్ని పొడిగించిందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మార్చి 31 నాటికి ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించిందని అన్నారు. జిల్లాలోని అర్హులైన వారందరూ ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వ్యవసాయంలో వచ్చిన నష్టాన్ని భరించలేక యువ కౌలు రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇల్లందకుంట మండలం సిరిసేడులో జరిగింది. స్థానికుల వివరాలు.. వంగ మధు(28) గ్రామంలో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంటను వేయగా.. రూ.2లక్షల వరకు నష్టం వచ్చింది. దీంతో మనస్తాపంతో ఆదివారం పురుగుమందు తాగి, వరంగల్ MGMలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు.
కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 36.6°C నమోదు కాగా, జమ్మికుంట 36.5, మానకొండూర్ 36.4, రామడుగు 36.2, వీణవంక 36.0, ఇల్లందకుంట 35.8, గన్నేరువరం 35.7, కరీంనగర్ 35.6, హుజూరాబాద్ 35.2, శంకరపట్నం, చిగురుమామిడి 35.1, చొప్పదండి 34.8, తిమ్మాపూర్ 34.5, కరీంనగర్ రూరల్ 34.0, కొత్తపల్లి 33.4, సైదాపూర్ 33.3°C గా నమోదైంది.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మార్చి 23 ఆదివారం అర్ధరాత్రి శంకరపట్నం మండలం లింగాపూర్‌లో ఏకంగా 6 ఇళ్లలో దొంగతనాలు జరిగిన విషయం తెలిసిందే. మార్చి 14న మానకొండూరు జడ్పీహెచ్‌ఎస్‌లో 23 ట్యాబ్‌లను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా విచ్చలవిడిగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. PLEASE SHARE IT.
సుదీర్ఘ సెలవుల అనంతరం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ప్రారంభం కాగా.. పత్తి ధర భారీగా పెరిగింది. బుధవారం మార్కెట్‌కు 9 వాహనాల్లో రైతులు 109 క్వింటాల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా..గరిష్ఠంగా రూ.7,380, కనిష్ఠంగా రూ.7,250 పలికింది. గోనెసంచుల్లో 13 క్వింటాళ్లు రాగా ₹5,300 నుంచి ₹5,500 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. గతవారం కంటే తాజాగా పత్తిధర ₹150 పెరిగింది. ధరలు మరింత పెరగాలని రైతులు కోరుకుంటున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్ మండలం పూసాలలో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఎస్‌ఐ శ్రావణ్ ప్రకారం.. నల్ల లింగమూర్తి(39) PDPLలో ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వివాహం కావడం లేదనే మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. సోదరుడు రాజేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 37.7°C నమోదు కాగా, గన్నేరువరం 37.6, మానకొండూర్ 37.3, జమ్మికుంట 37.2, కరీంనగర్ 37.0, వీణవంక 36.3, చిగురుమామిడి 35.9, కొత్తపల్లి, ఇల్లందకుంట 35.4, తిమ్మాపూర్ 35.3, చొప్పదండి, కరీంనగర్ రూరల్ 35.2, రామడుగు 35.0, హుజూరాబాద్ 34.9, సైదాపూర్ 34.5, శంకరపట్నం 34.2°C గా నమోదైంది.
ఆర్టీసీ కార్గో ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు ఆర్టీసీ చేసింది. ఒక్కొక్క ప్యాకెట్‌కు రూ.151, ఆన్‌లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, బుకింగ్ కోసం KNR 91542 98581, 9154298561, GDK 91542 98554, HSB 9154298673, HZB 9154298559, మంథని 9154298554, JGL 7780250439, KRTL 9154298572, MTPL 9154298574, SRCL 9154298576, VMD 9154298574 నంబర్లలో సంప్రదించవచ్చు.
Sorry, no posts matched your criteria.