India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ రోజు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో గ్రామపాలన అధికారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TGRSA చైర్మన్ లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామపాలన అధికారులు ప్రజలను మన కుటుంబ సభ్యుల లాగా భావించి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
కరీంనగర్ జిల్లా పర్యటనకు మరికాసేపట్లో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ రానున్నారు. LMD కాలనీలో బ్యూటీషియన్, జ్యూట్ బ్యాగ్స్ టైలరింగ్, ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్లో శిక్షణ పొందిన మహిళలకు మానకొండూర్ MLA కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి వీరు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. అనంతరం కరీంనగర్లోని మహాత్మ జ్యోతిరావు పూలే గ్రౌండ్లో జరిగే బతకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు.
KNR కార్పొరేషన్ ప్రజలు కాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతూ అల్లాడుతున్నారు. డంపింగ్ యార్డ్ నిర్వహణపై వారు ఎన్ని ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదు. రూ.16 కోట్లతో బయో మైనింగ్ సిస్టంతో చెత్త తొలగింపు ప్రక్రియ చేపట్టినా అది సత్ఫలితాలు ఇవ్వడం లేదు. కాగా, సమస్యకు పరిష్కారం చూపడంలో స్థానిక నేతలకు చిత్తశుద్ధి లేదనే విమర్శలున్నాయి. యార్డ్‌ను మరోచోటకు తరలించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కరీంనగర్‌లో ట్రాఫిక్ నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయడంలో ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ జిల్లా ట్రాఫిక్ పోలీసులు కొత్త వాట్సప్ నంబర్‌ను తెచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినట్లు గమనిస్తే, వాటిని టైమ్ స్టాంప్ కెమెరాతో ఫొటో తీసి 9381919112 నంబర్‌కు వాట్సప్ చేయాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. రాంగ్ రూట్, త్రిబుల్ రైడింగ్, రోడ్డుకు అడ్డంగా పార్క్ చేయడం లాంటి ఉల్లంఘనలను తమ దృష్టికి తేవాలన్నారు.
వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న హైపటైటిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. నేషనల్ వైరల్ హైపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా హైపటైటిస్ వ్యాధిగ్రస్తుల నుండి వైద్యులు, సిబ్బందికి వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్తగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
పట్టణంలోని బాల సదన్, శిశు గ్రహాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జ్ కే.వెంకటేష్ సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులతో ముచ్చటిస్తూ కష్టపడి చదువుకుని ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించాలని తెలియజేశారు. శిశు గృహాలలోని వంట, ఆహార పదార్థాలను నిలువచేసే గదులను తనిఖీ చేశారు. పిల్లలు క్రమశిక్షణను అలవర్చుకోవాలని, శిశు గృహ లోని పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ వహించాలని కోరారు.
కరీంనగర్‌లో ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేడు రామ్‌నగర్‌లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆయుర్వేద ఔషధాలు, యోగాసనాలను పరిశీలించి, ఉచిత సేవల వివరాలను రోగులకు తెలియజేయాలని ఆదేశించారు. గర్భిణీలకు యోగాసనాల అవగాహన, ఆస్పత్రి ఆవరణలో స్వచ్ఛత, మొక్కల నాటడం చేయాలన్నారు.
కరీంనగర్ జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో హెపటైటిస్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర కార్మికులకు హెపటైటిస్ బీ వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణలో పనిచేసే సిబ్బందికి రోగనిరోధక శక్తిని పెంచే ఉద్దేశంతో ఈ టీకా కార్యక్రమం మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నేడు 2వ రోజు శ్రీ మహాదుర్గ అమ్మవారు గాయత్రిదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. అమ్మవారి దేవాలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. అమ్మవారికి ధూపదీప, నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 318 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.