India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. నిషేధిత భూముల జాబితాలోని భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆ భూముల జాబితాను నవీకరించాలని, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని ఆదేశించారు.
తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లిపాలతో రోగ నిరోధక శక్తి పెరిగి శిశువులు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. పుట్టిన శిశువుకు తప్పనిసరిగా గంటలోపు ముర్రుపాలు తాగించాలని పేర్కొన్నారు.
స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ(స్వయం ప్రతిపత్తి) కళాశాలలో ముందస్తు రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డి.వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై, రాఖీ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. సోదర భావన, పరస్పర ప్రేమ, రక్షణ భావనకు ప్రాతినిధ్యం వహించే ఈ పండుగను విద్యార్థులు ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
నేతన్నల నైపుణ్యానికి అద్దం పట్టేలా రేపు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామని కరీంనగర్ జౌళి శాఖ సహాయ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. గీతా భవన్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు చేనేత ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ గొప్ప వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కళానైపుణ్యాన్ని ప్రదర్శించిన ఉత్తమ చేనేత కళాకారులకు పురస్కారాలు అందజేస్తారు.
స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జయశంకర్ చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపాల్ కే. రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. జయశంకర్ జయంతి తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుగా నిలిచే రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని సప్తగిరి కాలనీ కేజీబీవీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాలోని 14 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలకు 2 చొప్పున కుట్టు మిషన్లు, 11 మోడల్ స్కూల్ బాలికల హాస్టళ్లకు రిఫ్రిజిరేటర్లు, దోమల నియంత్రణ పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తానాజీ వాకాడే తదితరులున్నారు.
కరీంనగర్ జిల్లాలోని 14 కస్తూర్బా బాలికల విద్యాలయాలకు ప్రత్యేకంగా ఉషా కుట్టు మిషన్స్, ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్స్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్యర్యంలో పంపిణీ చేశామని జిల్లా విద్యాధికారి చైతన్య జైని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంధర్బంగా DEO. చైతన్య జైని బాలికలను ఉద్దేశించి కుట్టు శిక్షణలో అన్ని మెలకువలు నేర్చుకొని అన్ని రంగాల్లో విద్యార్థి దశ నుంచే రాణించాలని పేర్కొన్నారు.
కరీంనగర్ నగరంలోని ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను కొనసాగించాలని పేర్కొన్నారు.
స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో NSS ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డి.వరలక్ష్మి మాట్లాడుతూ.. జయశంకర్ జీవితం, పోరాట స్పూర్తి, తెలంగాణ సాధనకు చేసిన త్యాగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో NSS ఆఫీసర్లు మొగిళి, లక్ష్మణ్ రావు, స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని 168 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బుధవారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రూ.37,86,500 విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.