Karimnagar

News March 16, 2025

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోనే టాప్ కరీంనగర్

image

ఉమ్మడి జిల్లాలో ఎండ దంచికొడుతోంది. శనివారం కరీంనగర్ జిల్లా బూర్గుపల్లిలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 41.5, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 41.1, పెద్దపల్లి జిల్లా మంథనిలో 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

News March 15, 2025

జమ్మికుంట: రైలుకింద పడి వ్యక్తి మృతి

image

జమ్మికుంట రైల్వేస్టేషన్లో వ్యక్తి మృతిచెందాడు. రైలు ఎక్కుతుండగా కొమురయ్య (50) జారిపడి చనిపోయాడు. మృతుడు రైల్వేలో గ్యాంగ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడు స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి.

News March 15, 2025

జమ్మికుంట: రైల్వేపట్టాలపై యువతి, యువకుడి మృతదేహాలు

image

జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్- పాపయ్యపల్లి గ్రామాల మధ్య రైల్వే పట్టాల పక్కన యువతీ, యువకుడి మృతదేహాలు కలకలం రేపాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రేమజంటగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే పోలీసులు మృతదేహాల వద్ద పంచనామా నిర్వహించి, వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిసమాచారం తెలియాల్సి ఉంది.

News March 15, 2025

KNR: ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన: KTR

image

కాంగ్రెస్ ప్రజాపాలనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ X ద్వారా తీవ్ర విమర్శలు చేశారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన అని కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంపద సృష్టిస్తాం , ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికిన నాయకులు.. సగటున నెలకు రూ.10 వేల కోట్ల చొప్పున రూ.లక్ష 50 వేల కోట్లు అప్పు తెచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంది అని అన్నారు.

News March 15, 2025

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

KNR జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఈదులగట్టేపల్లి 40.9°C నమోదు కాగా, జమ్మికుంట 40.7, నుస్తులాపూర్ 40.6, చిగురుమామిడి 40.5, ఇందుర్తి, అర్నకొండ, కొత్తపల్లి-ధర్మారం 40.4, గంగాధర 40.3, దుర్శేడ్, మల్యాల 40.2, గుండి 40.1, ఖాసీంపేట, రేణికుంట 40.0, KNR 39.9, గంగిపల్లి 39.8, వీణవంక 39.6, గట్టుదుద్దెనపల్లె, చింతకుంట, పోచంపల్లి 39.5, బురుగుపల్లి 39.3°C గా నమోదైంది.

News March 15, 2025

KNR: మోసాలకు గురవుతున్న వినియోగదారుడు!

image

మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.

News March 15, 2025

ధర్మపురి: బ్రహ్మోత్సవంలో సంస్కృతి నాట్య నీరాజనం

image

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కరీంనగర్‌కు చెందినటువంటి సంస్కృతి సంగీత నృత్యాలయం చిన్నారులు కూచిపూడి నృత్యాలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. రామా కోదండరామ, అన్నమాచార్య కీర్తన, అంతయు నీవే సౌభాగ్యలక్ష్మీ, రావమ్మ ఆనంద తాండవ, మాడెన్ శివుడు నృత్యాలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు, ఈవో శ్రీనివాస్, గణేష్, నాట్యచార్యులు సురేంద్రచారి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

News March 14, 2025

పోలీసుల కస్టడీలో పెద్దపల్లి వాసి అనుమానాస్పద మృతి

image

నిజామాబాద్‌లో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకుల ప్రకారం.. JGTL చెందిన చిరంజీవి, PDPLకి చెందిన సంపత్ ఇరువురు కలిసి గల్ఫ్‌కు కొందరిని పంపించారు. తీరా అక్కడికి వెళ్లిన వారికి పనిలేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్, చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.

News March 14, 2025

ALERT: KNR జిల్లాలో 40°C ఉష్ణోగ్రతలు

image

KNR జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఈదులగట్టేపల్లి, కొత్తపల్లి-ధర్మారం, గంగాధర, నుస్తులాపూర్, ఇందుర్తి 40.0°C నమోదు కాగా, జమ్మికుంట, మల్యాల 39.9, దుర్శేడ్ 39.6, వీణవంక, KNR 39.5, చిగురుమామిడి 39.4, కొత్తగట్టు, తాడికల్, గుండి 39.3, ఖాసీంపేట 39.1, రేణికుంట 39.0, తాంగుల 38.9, వెంకేపల్లి 38.8, చింతకుంట, బురుగుపల్లి 38.5, గట్టుదుద్దెనపల్లె 38.4°C గా నమోదైంది.

News March 14, 2025

కరీంనగర్: ప్రతి భవిత విద్యార్థికి ప్రొఫైల్ సిద్ధం చేయాలి: కలెక్టర్

image

భవిత కేంద్రాలలో ప్రత్యేక విద్య నేర్చుకుంటున్న ప్రతి దివ్యాంగ విద్యార్థికి ప్రొఫైల్ సిద్ధం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భవిత కేంద్రాలలో పనిచేస్తున్న ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్‌తో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. దివ్యాంగులకు మంజూరు చేసే యుడిఐడి కార్డుల పట్ల భవిత విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.

error: Content is protected !!