India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కువైట్ వెళ్లిన తమ్ముడిని ఇండియాకు రప్పించాలని ప్రవాసీ ప్రజావాణిలో ఓ అన్న ఫిర్యాదు అందజేశాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన అనుదీప్ ఉద్యోగరీత్యా కువైట్ వెళ్లాడు. అనుదీప్ వెళ్లిన కొన్ని రోజులకే అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో తన సోదరుడిని ఇండియాకు రప్పించాలని అనుదీప్ అన్న అనిల్ శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్ లోని గల్ఫ్ ‘ప్రవాసీ ప్రజావాణి’ లో వినతిపత్రం సమర్పించారు.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.88,305 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.50,416, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.28,230, అన్నదానం రూ.9,659,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
@ మహముత్తారం మండలంలో బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం. @ బోయిన్పల్లి మండలం మిడ్మానేరులో మహిళా మృతదేహం లభ్యం. @ జగిత్యాల లో క్లాస్మేట్ వేధింపులతో బాలిక ఆత్మహత్య. @ హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రి బాత్రూంలో భృణ శిశువు మృతదేహం లభ్యం. @ మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. @ సిరిసిల్ల జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్.
సజావుగా గ్రూప్స్ పరీక్షలను నిర్వహించడానికి సన్నద్ధం కావాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారు. గ్రూప్స్ పరీక్షల నిర్వహణ, తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం ఆయన కలెక్టర్లతో VC నిర్వహించారు. పరీక్షల నిర్వాహణకు ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాలను రేపటిలోగా తనిఖీ చేసి అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయో లేవో పరిశీలించాలన్నారు. కాన్ఫరెన్స్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ భూముల పట్టాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సాదాబైనామా ద్వారా దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్నప్పటికీ పట్టాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు పట్టాలు అందలేదు. ప్రభుత్వం స్పందించి వెంటనే పట్టాలు అందజేయాలని రైతులు కోరుతున్నారు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సమాచారం కింది విధంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత మొత్తం కలిపి 615 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో బాలురు 19,602, బాలికలు 17,050, మొత్తం విద్యార్థులు 36,672 మంది ఉన్నారు. (డీఎస్సీ) కొత్త టీచర్లతో కలిపి మొత్తం 2,931 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
కరీంనగర్ రూరల్ మండలంలో మొగ్దుంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి గ్రామాల్లో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. రూ.6 కోట్ల వ్యయంతో ఒక్కో గ్రామంలో 40 చొప్పున డబుల్ బెడ్రూం ఇళ్ల చొప్పున మొత్తం 120 ఇళ్లను నిర్మించారు. చాలా ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. కొత్త ప్రభుత్వంలోనైనా సొంతింటి కల నెరవేరుతుందని భావించిన పేద ప్రజలకు నిరాశే ఎదురైంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ TDPMA ఆధ్వర్యంలో ఉమ్మడి KNR జిల్లాలో డిగ్రీ & పీజీ కళాశాలల నిరవధిక బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలపై హామీ ఇవ్వడంతో బంద్ మిరమించారు. దీంతో నాలుగు రోజుల తరువాత శుక్రవారం ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా డిగ్రీ, పీజీ కాలేజీలు తెరుచుకున్నాయి.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆయన పుష్పగుచ్చాన్ని అందజేసి తన జన్మదినం సందర్భంగా ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. కేసీఆర్, ఎమ్మెల్యే సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం చేసిన ఘటన BHPL జిల్లా మహాముత్తారం మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. SI మహేందర్ కుమార్ వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక(12)పై అదే గ్రామానికి చెందిన రామయ్య(71).. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికవద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
Sorry, no posts matched your criteria.