India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ పెగడపల్లి మండలంలో కత్తితో పొడుచుకుని వ్యక్తి ఆత్మహత్య.
@ గోదావరిఖనిలో మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య.
@ ధర్మపురి మండలంలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు.
@ కరీంనగర్ మండలంలో కారు, బైకు డీ.. ఒకరి మృతి.
@ కోరుట్లలో హత్య కేసులో ఐదుగురి అరెస్ట్.
@ సుల్తానాబాద్ మండలంలో దాడికి పాల్పడిన ఇద్దరికి ఏడాదిన్నర జైలు శిక్ష.
@ సిరిసిల్లలో వైభవంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.63,569 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.34,600, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.21,760, అన్నదానం రూ.7,209 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
SU పీజీ ఫలితాలు విడుదలయ్యాయి. జులై, ఆగస్టులో నిర్వహించిన M.COMలోని జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇన్సూరెన్స్, MBA, MSCలోని కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో 2, 4వ సెమిస్టర్ ఫలితాలు రిలీజ్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.శ్రీరంగప్రసాద్ తెలిపారు. https://satavahana.ac.in/ ఫలితాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.
బతుకమ్మ, దసరా సందర్భంగా KNR రీజియన్‌లోని బస్సు డిపోల వారీగా ఆర్టీసీకి వచ్చిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. గోదావరిఖని-రూ.527.45(లక్షలు), హుస్నాబాద్-రూ.143.42, హుజూరాబాద్-రూ.211.49, జగిత్యాల- రూ.421.74, కరీంనగర్-1 రూ.338.36, కరీంనగర్-2 రూ.423.19, కోరుట్ల-రూ.225.73, మంథని- రూ.183.91, మెట్పల్లి-రూ.214.21, సిరిసిల్ల- రూ.227.44, వేములవాడ-రూ.232.86(లక్షలలో) వచ్చాయి.
బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీకి రూ.31.50 కోట్ల ఆదాయం సమకూరిందని కరీంనగర్ RM ఎన్.సుచరిత ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఆదాయ సముపార్జనలో శక్తివంచన లేకుండా కృషి చేసిన ఆర్టీసీ సంస్థ సిబ్బందికి, ప్రత్యేకంగా డ్రైవర్, కండక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సేవలపై నమ్మకముంచి ఇంతటి ఆదాయాన్ని ఆర్జించుటలో సహకరించిన ప్రతి ఒక్క ప్రయాణికుడికి సంస్థ తరఫున ధన్యవాదాలు తెలిపారు.
విద్యార్థినుల పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి వేధింపులకు పాల్పడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోషల్ మీడియాలో మహిళలు, విద్యార్థినుల పట్ల ఎవరైనా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో షీ టీం సత్ఫలితాలు సాధిస్తూ మహిళలు, విద్యార్థినులకు అండగా నిలుస్తోందన్నారు. అవసరమైతే 87126 56425 నంబరును సంప్రదించాలన్నారు.
గోదావరిఖని పరశురాం నగర్‌కు చెందిన సంతోశ్ పట్టణంలోని కళ్యాణ్ నగర్ మటన్ షాపుల రహదారిపై మృతి చెందాడు. ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయి ప్రాణాలు వదిలాడు. అయితే అతిగా మద్యం తాగి మరణించి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లక్ష్మక్కపల్లిలో సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు మేనిఫెస్టోను యువ నాయకుడు మద్దుల ప్రశాంత పటేల్ విడుదల చేశారు. తనను గెలిపిస్తే 10 తరాలు గుర్తుండిపోయేలా చేస్తానంటూ ముందస్తుగా విడుదల చేసి నాయకులు ఆలోచింపజేసే విధంగా చేశారు. ప్రతి నెల హెల్త్ క్యాంప్, ఆడ పిల్ల పెళ్లి కానుక, మూతబడిన పాఠశాల రీ-ఓపెన్, ఆడపడుచులకు టైలరింగ్ శిక్షణ తదితర హామీలు మేనిఫెస్టోలో ఉన్నాయి.
ట్రాన్స్‌జెండర్‌తో యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన కుమార్, మ్యాడంపెల్లికి చెందిన కరుణంజలి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం పెద్దలకు చెప్పి ఒప్పించి బుధవారం వివాహం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా ట్రాన్స్‌జెండర్ల అధ్యక్షురాలు నిహారిక, సభ్యులు అలకుంట ప్రశాంతి, రాంబాయి, జానూ, రాధికా, రమ్య, ఆరోహి పాల్గొన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ డైరెక్టర్ పీవీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం ఆయన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి చింతల కుంట పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పురోగతి వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ఉండే విధంగా వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.