India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పేద మహిళలకు బతుకమ్మ పండగ కానుకగా అందించే చీరల పంపిణీపై సందిగ్ధం నెలకొంది. గతేడాది కరీంనగర్ జిల్లాలో 3,53,707 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండగకు చీరల పంపిణీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరో వారం రోజుల్లో బతుకమ్మ ప్రారంభం కానుండగా ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యవసాయం తరువాత రైతులు ఎక్కువగా పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అనివార్య కారణాలతో పశువులు మృతి చెందితే రైతులకు అందించే పశు బీమా పథకం ఆరేళ్లుగా అమలు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు, పిడుగు పాటుకు గురై పలు పశువులు మృత్యువాత పడ్డాయి. ప్రభుత్వం బీమా పథకాన్ని పునరుద్ధరించి ఆదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.
అనారోగ్యంతో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలో ఆటో డ్రైవర్ వాసం ప్రసాద్(32) అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. పేద కుటుంబం కావడంతో గ్రామస్థులు చందాలు సేకరించి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అమెరికా లాస్‌వెగాస్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మైనింగ్ ప్రదర్శనను ‘MINExpo’ ను DY CM భట్టి విక్రమార్క, సింగరేణి C&MD బలరాం నాయక్, అధికారుల బృందం పరిశీలించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు జరిగే ఈవెంట్‌లో తాజా మైనింగ్ ఆవిష్కరణలు, సాంకేతికత, యంత్రాలను ప్రదర్శించారు. పరిశ్రమల నిపుణులతో నెట్‌వర్క్‌కు అవకాశాలను వివరించారు. ఈవెంట్‌లో 125 దేశాల కంపెనీల నుంచి 44,000 మంది నిపుణులు పాల్గొన్నారు.
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ ZPHSలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. గత BRS ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మూలంగా ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌలిక వసతులు, బోధన కల్పించడంలో విఫలమైందన్నారు. వెంటనే జాబితాపూర్ ZHPSకు టాయిలెట్స్, మౌలిక వసతులు కల్పించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని లేఖ ద్వారా కలెక్టర్‌ను కోరారు.
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, హ్యాండ్లింగ్, లిఫ్టింగ్, ప్యాకింగ్ విభాగంలో, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీస్ జాగిలం విభాగంలో ట్రాకింగ్, ఎక్స్క్లూజివ్ విభాగాల్లో అవగాహన కల్పించారు.
@ వడ్డేలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ సిరిసిల్ల జిల్లాలో వ్యక్తి హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు.
@ జగిత్యాలలో పోలీస్ డ్యూటీ మీట్‌ను ప్రారంభించిన ఎస్పీ.
@ గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.
@ మెట్ పల్లిలో గంజాయి విక్రయించిన వ్యక్తి రిమాండ్.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నేడు ఉదయం 7 గేట్లు ఎత్తిన అధికారులు సాయంత్రం వరకు 5 గేట్లు మూసి 2 గేట్ల ద్వారా 33,318 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల(80.5TMC)కు గాను, ప్రస్తుతం 1091 అడుగుల (80.501TMC)ల నీరు నిల్వ ఉందన్నారు.
వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకరికి జీవిత ఖైదు, రూ.2,500 జరిమానా, మరొకరికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.2500 జరిమానా పడినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. ముస్తాబాద్‌కి చెందిన రాజంను ఆస్తుల తగాదాల్లో మరియమ్మ, ఆమె కుమారుడు మల్లేశం 01-09-2020న గొడ్డలితో నరికి చంపారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో నేడు సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత వారికి శిక్ష విధించినట్లు SP తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో డిమాండ్‌కు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచి ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో యువతకు స్కిల్ డెవలప్ మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి కల్పనతో పాటు కులవృత్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Sorry, no posts matched your criteria.