Karimnagar

News September 20, 2024

కరీంనగర్: వరి పంట వైపే మొగ్గు!

image

కరీంనగర్ జిల్లాలో పంటల నమోదు ప్రక్రియ పూర్తయింది. ఈ సర్వేలో ఈ సీజన్‌లో రైతులు వరి పంట వైపే మొగ్గు చూపినట్లు వెళ్లడైంది. క్షేత్రస్థాయిలో విస్తీర్ణ అధికారుల నుంచి ఏవోలు, ఏడీఏలు, డీఏవో వరకు లక్ష్యాలు నిర్దేశించుకొని చేపట్టిన సర్వేతో సాగు విస్తీర్ణం నిర్ధారణ చేశారు. జిల్లాలో 3,34,606 ఎకరాల సాగు భూమిలో అధిక శాతం 2,73,400 ఎకరాల్లో వరిసాగు చేపట్టినట్లు తెలిపారు.

News September 20, 2024

ఉమ్మడి KNR జిల్లాలో సర్వేయర్ల కొరత!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్వేయర్ల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూముల సర్వేకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పట్టించుకునేవారే కరువయ్యారు. సర్వేయర్ల నియామకం లేకపోవడంతో సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఎదురు చూస్తున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని 4 జిల్లాల్లో 14,287 సర్వే దరఖాస్తులు దరఖాస్తులు పెండింగ్ ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

News September 20, 2024

త్రిసభ్య కమిటీలో కోరుట్ల ఎమ్మెల్యేకు చోటు

image

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితులపైన స్టడీ చేయడానికి త్రిసభ్య కమిటీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య అధ్యక్షతన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌లతో కలిపి కమిటీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు రాష్ట్రంలోని పలు అసుపత్రులను సందర్శించి ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక అందించనుంది.

News September 20, 2024

KNR: ఇక ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ యాప్!

image

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేందుకు విద్యాశాఖ.. ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను అమలు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. కాగా, జిల్లాలోని 651 ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది 2,729 మంది పనిచేస్తున్నారు.

News September 20, 2024

కరీంనగర్: తీరనున్న గల్ఫ్ కష్టాలు!

image

ఎట్టకేలకు గల్ఫ్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్మికుల సమస్యలపై సలహా కమిటీ ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల విద్యార్థులకు గురుకుల విద్యాలయాల్లో సీట్ల కేటాయింపుకు ప్రాధాన్యత, డిసెంబర్ 7, 2023 నుంచి గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించాలని నిర్ణయించింది. కాగా, ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్లకు చెందిన యువత గల్ఫ్ బాట పట్టారు.

News September 20, 2024

ఇల్లంతకుంట: బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థికి పాముకాటు

image

సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలి పల్లిలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థి పాము కాటు గురయ్యాడు. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన రామవత్ రోహిత్(12) అనే విద్యార్థి బీసీ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం పాము కరిచిందని కేకలు వేశాడు. గమనించిన పాఠశాల సిబ్బంది ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు.

News September 20, 2024

జగిత్యాల: వరి ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష

image

రాబోయే ఖరీఫ్ 2024-25 వరిధాన్యం కొనుగోలుకు సంభందించి వివిధ శాఖల అధికారులతో గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. మద్దతు ధర క్వింటాకు గ్రేడ్ ఏ రకానికి రూ.2,320, కామన్ రకానికి రూ.2,300 ధర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా ప్యాడి క్లీనింగ్ మిషన్స్, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. టోకెన్ పద్ధతి పాటించాలని సూచించారు.

News September 19, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్య ప్రసాద్.
@ మల్లాపూర్ మండలంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.
@ పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.
@ మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి.
@ వరి ధాన్యం కొనుగోలుపై జగిత్యాల కలెక్టర్ సమీక్ష.

News September 19, 2024

డీజీపీని కలిసిన బీఆర్ఎస్ MLAలు

image

తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులపై వరుస దాడులు, స్థానిక పోలీసుల వైఫల్యం వంటి విషయాలపై రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను HYDలో కలిసి దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీని కలిసిన వారిలో కోరుట్ల MLA డా.కల్వకుంట్ల సంజయ్, హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులున్నారు.

News September 19, 2024

ఏకలవ్య మోడల్ స్కూల్‌లో స్వచ్ఛ ఆర్ట్ గ్యాలరీలో పాల్గొన్న బండి

image

స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా కొనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఏకలవ్య మోడల్ స్కూల్లో గురువారం స్వచ్ఛ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలో పాఠశాల విద్యార్థులు తయారుచేసిన సింగిల్ యూస్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ బాటిల్స్‌, పేపర్‌తో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. స్కూలు ఆవరణలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ మొక్క నాటారు.