India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగపూర్- సికింద్రాబాద్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎట్టకేలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందేభారత్ ట్రైన్ పట్టాలెక్కింది. ఈ ట్రైన్ రామగుండం నుంచి సికింద్రాబాద్‌కు కేవలం 3 గంటల్లో చేరుకుంటుదని అధికారులు తెలిపారు. మంగళవారం మినహా మిగతా రోజుల్లో ఈ సర్వీస్ నడవనుంది. అయితే సికింద్రాబాద్ నుంచి రామగుండం వరకు ఏసీ చైర్‌కార్‌లో రూ.865 కాగా ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌లో రూ.1,510గా ధర నిర్ణయించారు.
70 ఏళ్లు పైబడిన వారికి వైద్యం కోసం రూ.5 లక్షల ప్రత్యేక బీమా కల్పిస్తామని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని వృద్ధులు కేంద్రం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉన్నప్పటికీ ఈ బీమా వర్తించనుంది. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల పరిధిలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులు రూ.2 లక్షల మందికిపైగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన కరీంనగర్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శోభయాత్ర ర్యాలీలో ట్రాక్టర్‌ను నడిపి సరదాగా గడిపారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ సంగంపల్లి గ్రామానికి చెందిన కూడా తిరుపతికి కొత్తపల్లి గ్రామం మోయ తుమ్మెద వాగులో (ఎల్ఎండి మానేరు డ్యామ్)లో 28 కిలోల బొచ్చె చేప వలకు చిక్కింది. చేపల వేటలో భాగంగా సోమవారం మత్స్యకారులు వాగులో చేపలు పడుతున్న సందర్భంలో తిరుపతి అనే మత్స్యకారుడి వలలో భారీ చేప చిక్కింది. గణపతి నిమజ్జనం రోజున ఈ వాగులో ఇంత పెద్ద చేప తన వలకు చిక్కడం ఎంతో శుభసూచకమని అతను ఆనందం వ్యక్తం చేశాడు.
జగిత్యాల పట్టణంలోని 28 వార్డుకు చెందిన కొత్తకొండ సాయికృష్ణ గౌడ్ (37) గుండెపోటుతో ఆకస్మాత్తుగా మరణించాడు. పదేళ్ల నుంచి గల్ఫ్‌లో ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నెల క్రితమే ఇంటికి వచ్చిన సాయి తిరిగి కువైట్ వెళ్లాడు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించినట్లు తన సహచర స్నేహితులు ఫోన్ ద్వారా తెలపడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
నవరాత్రుల పాటు పూజలందుకున్న ఏకదంతుడు నేడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు ఉమ్మడి KNRజిల్లా అంతటా గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10,325 విగ్రహాలను ప్రతిష్ఠించగా ఇప్పటికే కొన్ని విగ్రహాలను నిమజ్జనం చేశారు. DJలను నిషేధించినట్లు పోలీసులు ప్రకటించడంతో నిర్వాహకులు కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మహమ్మద్ ప్రవక్త మిలాద్-ఉన్-నబీ జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన సబ్ర్ (సహనం), సిదక్ (సత్యనిష్ట) తహారత్ (పవిత్రత) జకాత్ (సహాయం) రహ్మా (దయ) అనే పంచ సూత్రాలు మానవీయ జీవితానికి బాటలు వేస్తాయని పేర్కొన్నారు.
సోమవారం జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా హుజూరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. ☞విగ్రహాలు కరెంటు వైర్లకు తగలకుండా చూసుకోవాలి. ☞నీటిలో క్రేన్ల ద్వారా మాత్రమే విగ్రహాలను వేయాలి. ☞ఈత రాని వారు నీటి వద్దకు వెళ్లకూడదు. ☞హైటెన్షన్ వైర్ల వద్ద విగ్రహాలను జాగ్రత్తగా తీసుకెళ్లాలి. ☞వాహనాలలో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం పొలాస మూలమలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్తున్న ట్రావెల్ బస్సు, వెల్గొండ నుంచి జగిత్యాల వైపు వస్తోన్న స్కూటీ, బైకును ఢీకొంది. దీంతో అల్లీపూర్‌కు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కొత్త రేషన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా మోక్షం కలగడం లేదు. తొమ్మిదేళ్ల క్రితం నిలిచిపోయిన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నేటికీ పునరుద్ధరించుకోలేదు. ఆహార భద్రతతో పాటు సంక్షేమ పథకాలకు ఈ కార్డే కీలకం కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తోందని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.