India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.2,32,941 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,09,814 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.81,660, అన్నదానం రూ.41,467 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి 32 రోజుల హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. రూ.1,50,24,507 వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. బంగారం 170 గ్రాములు రాగావెండి 9 కిలోల 800 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. హుండీ లెక్కింపులో ఈవో వినోద్ రెడ్డి, ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, శ్రీరాజరాజేశ్వర సేవాసమితి వారు పాల్గొన్నారు.
తమ మండలంలోని రోజుకో పాఠశాల సందర్శిస్తూ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఎంఈఓలకు సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. సరుకుల నిల్వ గది, రికార్డులు పరిశీలించి నాణ్యత పాటించేలా చూడాలన్నారు.
పెద్దపల్లిలో డిసెంబర్ 4న సీఎం పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణకు అనువైన ప్రదేశాలను MLA విజయ రమణారావు కలెక్టర్ శ్రీహర్షతో కలిసి బుధవారం పరిశీలించారు. రంగంపల్లి-పెద్దకల్వల శివారులోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సభ ఏర్పాట్లకు అనువుగా ఉంటుందని MLA తెలిపారు. సభా స్థలాన్ని శుభ్రం చేయాలని, గురువారం ఉదయం స్టేజ్ ఏర్పాటుకు HYD నుంచి ప్రత్యేక బృందం వస్తుందని చెప్పారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్‌ను ఈటల కలిసి వినతి పత్రం అందజేశారు. అదే విధంగా కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలని కోరారు.
యాసంగి పోయి వానాకాలం వచ్చింది, వానాకాలం పోయి మళ్లీ యాసంగి వచ్చింది కానీ రైతు భరోసా రాకపోయే అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రెండు విడతలుగా రూ.20 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టిన రైతు భరోసా మీద వేసిన మంత్రి వర్గ ఉపసంఘంలో మాత్రం చలనం లేదన్నారు. ఎన్ని ఎకరాలకు ఇస్తారో? ఎప్పటి నుంచి ఇస్తారో? అసలు ఇస్తారో, ఇవ్వరో? ఇప్పటి వరకూ స్పష్టత లేదన్నారు.
సోలార్ విద్యుత్ సద్వినియోగం, పొదుపు చర్యలలో భాగంగా సింగరేణి సంస్థ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మందమర్రి సోలార్ ప్లాంట్‌లో పగటిపూట ఉత్పత్తి జరిగి, వినియోగం తర్వాత ఇంకా మిగిలిన సోలార్ విద్యుత్‌ను వృథాగా పోనీయకుండా బ్యాటరీలో నిల్వ చేసే ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం’ ను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేస్తోందని సంస్థ C&MD బలరాం ప్రకటనలో తెలిపారు.
మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు కరీంనగర్ రీజియన్‌లో 104 పోస్టులు కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి.అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పుప్పాల రమ్య (19)కు కొంత కాలంగా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమెకు పెళ్లి ఇష్టం లేక ఇంటి ఆవరణలో గల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రమ్య తండ్రి చిన్నయ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బ గ్రామానికి చెందిన పుప్పాల రమ్య (19) అనే యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అనిల్ మంగళవారం తెలిపారు. గత 2 నెలలుగా ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుoడగా ఇష్టం లేదని చెప్పిందనీ, పెండ్లి సంబంధాల విషయంలో తల్లిదండ్రుల నిర్ణయాన్ని నిరాకరించలేక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Sorry, no posts matched your criteria.