Karimnagar

News June 28, 2024

కరీంనగర్: 4 వరకు బీ ఫార్మసీ పరీక్ష ఫీజు గడువు

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీ ఫార్మసీ (ఎనిమిదో సెమిస్టర్) పరీక్ష ఫీజు గడువు జులై 4 వరకు ఉందని ఎస్‌యూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీ రంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం రూ.300తో జులై 8 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News June 28, 2024

గోదావరిఖని: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

గోదావరిఖని పట్టణంలోని ఓ కాలనీలో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై వన్ టౌన్ పోలీసులు గురువారం అర్ధరాత్రి ఆకస్మిక దాడి చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలితో పాటు నలుగురు విటులు, మరి కొందరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలం నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. దూర ప్రాంతాల నుంచి మహిళలు ఇక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది.

News June 28, 2024

నేడు కొండగట్టులో జ్యేష్ఠాభిషేకం

image

మాల్యాల మండలం కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్వామి వారికి సుగంధ ద్రవ్యాలు కలిపిన 108 కలశాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించి పూజలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం గ్రీష్మ రుతువులో వేసవి తాపం తగ్గి వర్షాలు సమృద్ధిగా కురవాలని స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం చేస్తామని అర్చకులు కపిందర్ పేర్కొన్నారు.

News June 28, 2024

జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై జరిగిన దాడిని ఖండించిన మంత్రి

image

జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్‌పై జరిగిన దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులపై దాడులు సరికాదని రవాణా శాఖ మంత్రిగా ఉద్యోగులకు అండగా ఉంటానని అన్నారు. కమీషనర్ రమేశ్‌పై జరిగిన దాడి ఘటనపై పోలీసులతో మాట్లాడారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. భవిష్యత్తులో అధికారులపై దాడి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.

News June 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల ఆర్డిఓ ఆఫీసును తనిఖీ చేసిన కలెక్టర్.
@ మెట్పల్లి మండలంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడి మృతి.
@ వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుడి రూ.35 లక్షల విరాళం.
@ బోయిన్పల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
@ కమలాపూర్ మండలంలో స్కూల్ వ్యాన్, కారు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.
@ కరీంనగర్‌లో గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి.

News June 27, 2024

రాష్ట్రంలో చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మంత్రి వినతి

image

మంత్రి శ్రీధర్ బాబు, MLA అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కోరామన్నారు. దీంతో కేంద్ర మంత్రి సాగుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

News June 27, 2024

KNR: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆర్మ్‌డ్ రిజర్వులో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్(51) విధుల్లో ఉండగా గుండె పోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా.. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.

News June 27, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.65,357 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.32,200, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.24,750, అన్నదానం ద్వారా రూ.8,407 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News June 27, 2024

సీఎం రేవంత్ నివాసానికి జీవన్ రెడ్డి

image

ఢిల్లీలోని రేవంత్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గురువారం వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సమావేశమయ్యారు. జీవన్ రెడ్డికి పార్టీ హై కమాండ్ తగిన ప్రాధాన్యత ఇస్తుందని, వేరే పార్టీలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

News June 27, 2024

జగిత్యాల: కూతురితో కలిసి బావిలో దూకి తల్లి సూసైడ్

image

జగిత్యాల జిల్లాలో కూతురితో కలిసి తల్లి బావిలో దూకింది. స్థానికుల వివరాలు.. సారంగపూర్ మండలం అర్పల్లికి చెందిన బొండ్ల మౌనికకు ఆమె భర్తతో నిన్న రాత్రి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన మౌనిక కూతురితో కలిసి బావిలో దూకింది. గురువారం ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మౌనిక భర్తను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.