Karimnagar

News August 22, 2025

జమ్మికుంట మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు శని, ఆదివారాలు సెలవులు ప్రకటించారు. తిరిగి మార్కెట్ సోమవారం ప్రారంభమవుతుందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. నేడు 14 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి రాగా, గరిష్ఠ ధర రూ.7,600, కనిష్ఠ ధర రూ.6,500 పలికిందని చెప్పారు.

News August 21, 2025

KNR: ‘ఉచిత విద్యుత్ అందించండి’

image

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల కోసం KNRలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కరీంనగర్ విద్యుత్ శాఖ ఎస్‌ఈకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్‌లు, నియంత్రికలు, స్తంభాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

News August 21, 2025

KNR: ‘బాల భరోసా సర్వే పకడ్బందీగా చేయాలి’

image

కరీంనగర్ జిల్లాలో ఐదేళ్ల లోపు పిల్లల ‘బాల భరోసా’ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సర్వే ద్వారా ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించవచ్చని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తదితరులు పాల్గొన్నారు.

News August 21, 2025

KNR: ‘హెచ్ఐవి గురించి పూర్తి విధివిధానాలు తెలుసుకోవాలి’

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మీటింగ్ హాల్లో అంగన్వాడీ టీచర్లకు హెచ్ఐవిపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో DMHO వెంకట రమణ మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్తలు అందరూ హెచ్ఐవి గురించి పూర్తి విధివిధానాలు తెలుసుకోవాలని అన్నారు. అది వ్యాప్తి చెందే మార్గాలను, నివారణ చర్యలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసి హెచ్ఐవి నిరోధించడంలో ప్రధాన భూమిక వహించాలని తెలిపారు.

News August 21, 2025

KNR: MEPMA నూతన ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా స్వరూపరాణి

image

కరీంనగర్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నూతన ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా స్వరూపరాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) టి.కె.శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాల బలోపేతం, జీవనోపాధి అవకాశాల విస్తరణ వంటి కీలక కార్యక్రమాల అమలును ఆమె పర్యవేక్షించనున్నారు.

News August 21, 2025

KNR: పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

image

కరీంనగర్ కలెక్టర్ ఛాంబర్లో మీరా యువభారత్ కరీంనగర్ ఆధ్వర్యంలో కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ రూపొందించిన వికసిత భారత్- 2047 పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ పమెలా సత్పతి ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో కేంద్ర ప్రభుత్వం యువజనుల కోసం ప్రవేశపెట్టిన వివిధ రకాల పథకాలు, దరఖాస్తు విధానం తదితర విషయాలను పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా యువజన సభ్యులు పాల్గొన్నారు.

News August 21, 2025

KNR: ‘బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలి’

image

ఆర్థిక మద్దతు పథకాల లక్ష్య సాధనకు బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం నిర్వహించిన సమావేశంలో కోరారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 జూన్ వరకు రూ. 4314.88 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యాలలో 32.12 శాతం మాత్రమే పూర్తయిందని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.

News August 21, 2025

KNR: గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై సీపీ సమీక్ష

image

రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణపై KNR CP గౌష్ ఆలం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News August 20, 2025

KNR: శాతవాహన ఆచార్యునికి బెస్ట్ టీచర్ అవార్డు

image

రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను, ఆచార్యులను 2022-23 సం.కి అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా శాతవాహన విశ్వవిద్యాలయ ఉర్దూ విభాగ సహాయ ఆచార్యులు డా. నజీముద్దీన్ మునవర్‌ను ఎంపిక చేసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్ అభినందనలు తెలిపారు.

News August 20, 2025

HZB: ఆశావర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలిగా తాడూరి లత

image

హుజురాబాద్ మండలం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్స్ యూనియన్ ( సిఐటీయూ అనుబంధ) ఎన్నికలు బుధవారం హుజురాబాద్ పట్టణంలో జరిగాయి. ఈ ఎన్నికలకు జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేశ్, ఆశావర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి మారెళ్ళీ లత హాజరై ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. తాడూరి లత (కాట్రపల్లి) ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.