India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజు బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో కరీంనగర్ జిల్లాలోని పలు పాఠశాలలు విద్యార్థులను అనుమతించడం లేదు. బకాయిలు విడుదలయ్యే వరకు విద్యార్థులను అనుమతించబోమని పాఠశాలల యజమాన్యాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. దీంతో తమ పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నోడల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమలుపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనిచేయాలని సూచించారు.
మహిళా ఆటో డ్రైవర్లు ఆర్థిక సాధికారత సాధించి తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా, శిశు వికాస కేంద్రంలో ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పొంది ఉపాధి పొందుతున్న మహిళలతో ఆమె మంగళవారం సమావేశమయ్యారు. మహిళలు కేవలం డ్రైవింగ్‌లోనే కాక విభిన్న రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు.
కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సోమవారం న్యాయ సహాయ కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. వెంకటేష్ ప్రారంభించారు. మాదక ద్రవ్యాల బారిన పడిన బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు న్యాయ సహాయం అందించే పథకంలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో ఒక న్యాయవాది, పారా లీగల్ వాలంటీర్‌ను నియమించినట్లు వెల్లడించారు. బాధితులు న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఎన్నికల సమాచారం అందించడానికి, ఫిర్యాదులు స్వీకరించడానికి ఎన్నికల కమిషన్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీని కోసం ప్రజలు 92400 21456 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది. ఈ కాల్ సెంటర్ ప్రజలకు ఎన్నికల ప్రక్రియలో సహాయపడటమే కాకుండా, ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించడానికి కూడా ఉపయోగపడుతుంది.
మానవ హక్కుల సంస్థ, అవినీతి నిరోధక సంస్థ కరీంనగర్ జిల్లా జాయింట్ సెక్రటరీగా దుర్గం శివ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు మానవ హక్కుల సంస్థ జాతీయ అధ్యక్షుడు దేవానంద నాయుడు, నేషనల్ సెక్రటరీ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శివకుమార్‌కు వారు అభినందనలు తెలిపారు.
ఇసుక రవాణాలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. శనివారం సాయంత్రం వీణవంక మండలం కొండపాకలోని రెండు క్వారీలను ఆయన పరిశీలించి, ఇసుక లోడింగ్ ప్రక్రియ, నిలువలను చెక్ చేశారు. డిజిటల్ ట్రాకింగ్ విధానాన్ని పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమం ఉండదని పేర్కొన్నారు. తదుపరి ప్రకటన వచ్చేవరకు ప్రజావాణి జరగదన్నారు.
తిమ్మపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఎల్ఎండీ ప్రాజెక్ట్ పూడికతీత పనులను టీజీఎండీసీ వీసీ & ఎండీ భవేశ్ మిశ్రా ఐఏఎస్ పరిశీలించారు. కొత్తపల్లిలోని ఇసుక రీచ్ పనులను పరిశీలించి ప్రభుత్వపరంగా అన్ని అనుమతులతో, విధి విధానాలకు లోబడి పనిచేయాలని ఎమోట్ డ్రెడ్గింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి, పనిచేసే సిబ్బందికి సూచించారు.
ఈనెల 17 వరకు ఓట్ చోరీపై రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ జరుగుతుందని, కరీంనగర్ నగరంలోని అన్ని డివిజన్లలో డివిజన్‌కు కనీసం వందకు తగ్గకుండా సంతకాలు చేపడతామని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. చాలా ప్రాంతాల్లో ఓట్ చోరీ జరుగుతుందని, మొన్న పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడికి ఆధారాలతో చూపించామని, రేపటి నుంచి డివిజన్లలో దొంగ ఓట్లను వెలికితీస్తామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.