India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదులగట్టేపల్లి శివారులో లారీ డ్రైవర్ అజాగ్రత్తతో భారీ ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ ముందున్న ఓ కారును ఢీ కొట్టి, అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్లు ధ్వంసమవగా, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేయడంతో మహిళల స్థానాలు భారీగా పెరగనున్నాయి. కరీంనగర్ జిల్లాలో 5,30,337 మహిళా ఓటర్లు ఉండగా.. ఇందులో 7 జడ్పీటీసీ స్థానాలు, 7 ఎంపీపీ, 85 ఎంపీటీసీ, 159 గ్రామపంచాయతీలకు, 1,468 వార్డులకు సభ్యులుగా మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. దీంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకు సముచిత గౌరవం దక్కనుంది. పాలనా వ్యవస్థలో వీరు కీలకం కానున్నారు.
కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షుడిగా గుంజపడుగు హరిప్రసాద్ నియామకయ్యారు. ఈ మేరకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నారు. జాగృతి మొదలుపెట్టిన నాటి నుంచి జిల్లాలో క్రియాశీలకంగా పనిచేసినందుకు గాను జిల్లా జాగృతి అధ్యక్షుడిగా హరిప్రసాద్‌ను కవిత ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతానికి మరింత కృషి చేస్తానని హరిప్రసాద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
KNR పట్టణంలోని కిసాన్ నగర్‌లో 2015లో ప్రారంభమైన జంబిపూజ రాక్షస సంహారం కార్యక్రమం ఈ సంవత్సరంతో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక నేటి దసరా సంబరాలకు కిసాన్ నగర్ జంబిగద్దె వేదిక సిద్ధమైంది. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం స్థానికులు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పదేళ్ల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఈ ఏడాది కూడా వేడుకలను వైభవంగా జరుపుకోనున్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు.
నగరపాలిక ఆధ్వర్యంలో ఎల్ఎండీ సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీని కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. మొక్కలు ఎండిపోకుండా నీటిని అందిస్తూ ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నర్సరీలో పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించి శుభ్రం చేయాలన్నారు. రోడ్డు డివైడర్ల మధ్యలో మొక్కలు నాటించాలని సూచించారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలానికి చెందిన మోదుంపల్లి మహేశ్వరీ గ్రూప్-1 ఫలితాల్లో 474వ ర్యాంకు సాధించి డీఎస్పీ ఉద్యోగాన్ని దక్కించుకుంది. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో చదివిన ఆమె విజయంపై కరీంనగర్ సీపీ గౌస్ అలాం ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహేశ్వరీ విజయం గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలిచింది.
ప్రసిద్ధి చెందిన కరీంనగర్ చైతన్యపురి కాలనీలోని శ్రీ మహాశక్తి దేవాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఉన్నారు.
కరీంనగర్ రూరల్ మండలం చర్ల బూత్కూరులో విద్యుత్ షాక్‌కు గురైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లింగంపల్లి రాజేష్(22) గతనెల 28న ఇంటి వద్ద బట్టలు ఆరేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందాడు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో నిర్వహించిన పల్లకి సేవ కార్యక్రమంలో కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి విశేష పూజల అనంతరం ఆలయ అర్చకులు పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి దీక్షలో ఉన్న కేంద్రమంత్రి బండి ఈ సందర్భంగా అమ్మవారి ఆశీనులైన పల్లకిని మోశారు. ఆలయ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో KNR డివిజన్ పరిధిలోని మానకొండూర్ మండలం మినహా అన్ని మండలాలల పరిధిలోని గ్రామ పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలు సహా మానకొండూర్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత NOV 04, రెండో విడత NOV 08న ఎన్నికలు జరగనున్నాయి.
Sorry, no posts matched your criteria.