India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రజల సహాయార్థం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఏమైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే 1077 లేదా 9063211298 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.
ఖమ్మం కలెక్టరేట్‌లో జరిగిన PM ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. గిరిజన గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. రాబోయే 5 ఏళ్లలో రూ.79,156 కోట్లతో ఈ పథకం అమలవుతుందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 9 మండలాల్లోని 35 గ్రామాల్లో ఈ కార్యక్రమం అమలు కానుంది. గిరిజనులకు అవసరమైన వసతులు కల్పించాలన్నారు.
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. నీటిమునిగిన రోడ్లు, వంతెనలు దాటరాదని, వాగులు, చెరువుల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100, 1077 లేదా పోలీస్ కంట్రోల్ నెంబర్ 87126 59111, 90632 11298లకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
ఖమ్మం జిల్లాలో నిన్న ఉదయం 8.30 గంటల నుంచి నేడు ఉదయం 6 గంటల వరకు 1201.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. కొనిజర్లలో 95.1, YRP 92, వేంసూరు, KMM(R) 84.8, వైరాలో 84.1, రఘునాథపాలెంలో 82.4 మి.మీ. వర్షం పడింది. చింతకాని 74.2, కల్లూరు, SPL 57, ENKR 56, సింగరేణి 54, ఖమ్మం అర్బన్‌లో 51.8 మి.మీ.గా నమోదైందని జిల్లా సగటు వర్షపాతం 57.2 మి.మీ.గా ఉందన్నారు.
సత్తుపల్లి మండలం పాకలగూడెంలో విషాదం నెలకొంది. తల్లికూతుర్లను పాము కాటు వేయగా చిన్నారి మౌనిక (5) మృతి చెందింది. ఆమె తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇంట్లో నేలపై పడుకుని ఉండగా రాత్రి 2 గంటల సమయంలో పాము కాటు వేసిందని చిన్నారి తండ్రి గోపి తెలిపాడు. పాప మృతితో విషాదం నెలకొంది.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నందున అటువైపు వెళ్లవద్దని, రోడ్లపైకి వర్షం నీరు చేరడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంటికే పరిమితం కావాలని సూచించారు.
ఖమ్మం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. బుధవారం ఉ.8:30 నుంచి 11 గంటల వరకు 437.6 M.M రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వైరాలో 61.4 నమోదు కాగా.. అటు కొణిజర్ల 41, NKP 37.5, TLD 20.9, R.PLM 33.1, YPLM 37.5, వేంసూరు 18.0, KMM(U) 27.0, SPL 14.1, KMM(U) 24.3, ENKR 19.5, MDGD 13.7, సింగరేణి 8.3, KMPL 6.8, CTKN 33.6, KSMC 5.3, PNBL 3.5, BNKL 19.0, T.PLM 0.3, మధిర 12.8 M.M నమోదైంది.
చెల్లని చెక్కు కేసులో ఖమ్మంకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సత్తుపల్లి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. కల్లూరుకు చెందిన రామనరసింహారావు వద్ద ఉపాధ్యాయుడు జయరాజు 2015లో రూ.8.5 లక్షలు అప్పు తీసుకున్నారు. 2016లో తిరిగి చెల్లించేందుకు చెక్కు ఇచ్చాడు. బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో చెల్లలేదు. దీంతో రామనరసింహారావు కేసు దాఖలు చేయగా, విచారణ అనంతరం జడ్జి ఈ తీర్పు ఇచ్చారు.
పంటల నమోదు ప్రక్రియను సక్రమంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ పంటల సాగు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతులు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారుల వద్ద నమోదు చేయించాలన్నారు. రైతులు పంటల సాగు వివరాలు నమోదు చేయించకపోతే ధాన్యం కొనుగోలు సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన తెలిపారు.
ఖమ్మం నగరంలో త్వరలో ప్లాస్టింగ్ వ్యర్థాల రీసైక్లింగ్ ప్రారంభిస్తామని నగర మేయర్ నీరజ అన్నారు. మంగళవారం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అమలు చేస్తున్న ఆధునిక వ్యర్థ నిర్వహణ విధానాలు ఖమ్మంలో కూడా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మేయర్ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.