India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పునర్విభజనలో ఖమ్మం నియోజకవర్గాల సంఖ్య 8కి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలేరులో కూసుమంచి, తిరుమలాయపాలెం, KMM(R), ఏదులాపురం, నేలకొండపల్లి(C)లో NKP, ముదిగొండ, చింతకాని, KMM 1లో KMM అర్బన్ (C), KMM(2) రఘునాథపాలెం(C), మధిర(C) MDR, ఎర్రుపాలెం, బోనకల్, వైరా(C) వైరా, కొణిజర్ల, తల్లాడ, కల్లూరు(C)లో KLR, ఏన్కూరు, కామేపల్లి, సింగరేణి, సత్తుపల్లి(C)లో SPL, వేంసూరు, పెనుబల్లి ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా HYDలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో విశిష్ట సేవలకు గాను DCHS డా.రాజశేఖర్, పెనుబల్లి CHC డా. కిరణ్ కుమార్, డా. శివరామకృష్ణ, కల్లూరు CHC డా. రామ్‌శరణ్ పురస్కారాలు అందుకున్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ వీరికి అవార్డులు అందజేశారు.

ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న, వరి కొనుగోళ్లలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 9వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఈ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిలు, మండల అధ్యక్షులు, రైతు నాయకులు సమన్వయంతో పాల్గొని ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు.

ఖమ్మం జిల్లాలో పదో తరగతి జీవశాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి చైతన్య జైని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 16,975 మంది విద్యార్థులకు గాను 16,954 మంది హాజరయ్యారని, 99.88% హాజరు నమోదైందని పేర్కొన్నారు. 35 కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు.

ఖమ్మం జిల్లాలో పెట్రోల్ ధరల తారతమ్యం వాహనదారులను అయోమయానికి గురిచేస్తోంది. రిలయన్స్, నయారా బంకుల్లో లీటర్ పెట్రోల్ ధరను రూ.112గా నిర్ణయించడంతో వినియోగదారులు విస్తుపోతున్నారు. ఇతర బంకుల్లో రూ.107కే లభిస్తుండగా, ఇక్కడ అదనంగా రూ.5 వసూలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరల వ్యత్యాసంపై సమాచారం లేని జనం బంకులకు వెళ్లి సిబ్బందితో గొడవకు దిగుతున్నారు.

ప్రభుత్వ డయాగ్నస్టిక్ హబ్‌లో సాంకేతిక సమస్యలు రోగులకు శాపంగా మారాయి. యంత్రాల కాలం చెల్లడంతో నిత్యం జరిగే వేలాది పరీక్షలు నిలిచిపోయాయి. 2021 నుంచి లక్షలాది మందికి అండగా నిలిచిన ఈ కేంద్రం, నిర్వహణ లోపంతో ఇప్పుడు మూలనపడింది. ఉచిత సేవలు అందక సామాన్యులు ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. అధికారులు స్పందించి కొత్త యంత్రాలను ఏర్పాటు చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఖమ్మం జిల్లాలోని GPలు పన్నుల వసూళ్లలో రికార్డు స్థాయి పురోగతి సాధించాయి. నిర్దేశిత లక్ష్యం ₹15.34 కోట్లు కాగా, మార్చి 31 నాటికి ₹13.87 కోట్లు (90%) వసూలు కావడం విశేషం. అధికారుల సమన్వయం, పాలకవర్గాల చొరవతో ఈ విజయం సాధ్యమైంది. మండలాల వారీగా చూస్తే 94 % వసూళ్లతో కొణిజర్ల అగ్రస్థానంలో నిలవగా, 87 %తో చింతకాని మండలం వెనుకబడింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి శతశాతం వసూళ్లే ధ్యేయంగా యంత్రాంగం కదులుతోంది.

ఖమ్మం జిల్లాలో ధాన్యం నిల్వలు రైస్ మిల్లుల్లోనే మూలుగుతున్నాయి. వానాకాలం సేకరించిన 2.30 లక్షల మెట్రిక్ టన్నుల్లో.. ఇప్పటికీ లక్ష టన్నుల మేర బియ్యంగా మారక మగ్గిపోతున్నాయి. ఫలితంగా యాసంగి కొనుగోళ్లపై అనిశ్చితి నెలకొంది. పలు మండలాల్లో పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పాత నిల్వలు ఖాళీ కాకపోతే కొత్త ధాన్యం పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఖమ్మం పోలీస్ శాఖలోని పాత వస్తువులకు ఈ నెల 13న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. నగరంలోని ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) స్టోర్‌లో ఉన్న ఫర్నిచర్, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్ సామాగ్రి (CPU, UPS, ప్రింటర్లు) తదితరాలను వేలం వేయనున్నారు. ఆసక్తి గల వారు ఆ రోజు ఉదయం 9 గంటలకు వేలంలో పాల్గొనవచ్చని సూచించారు.

ఖమ్మం పోలీస్ శాఖలోని పాత వస్తువులకు ఈ నెల 13న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. నగరంలోని ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) స్టోర్‌లో ఉన్న ఫర్నిచర్, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్ సామాగ్రి (CPU, UPS, ప్రింటర్లు) తదితరాలను వేలం వేయనున్నారు. ఆసక్తి గల వారు ఆ రోజు ఉదయం 9 గంటలకు వేలంలో పాల్గొనవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.