Khammam

News April 6, 2026

పారదర్శక పాలనే లక్ష్యం: కలెక్టర్ అనుదీప్

image

ఖమ్మం జిల్లాలో పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస రెడ్డితో కలిసి రెవెన్యూ, ఆరోగ్య, పారిశుధ్య అంశాలపై సమీక్షించారు. మాతృ, శిశు మరణాలను సున్నాకు తగ్గించేలా దృష్టి సారించాలని వైద్యాధికారులకు సూచించారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చూడాలని, విధుల్లో అలసత్వం వహించవద్దని దిశానిర్దేశం చేశారు.

News April 6, 2026

ఖమ్మం: ప్రజావాణీకి పోటెత్తిన అర్జీదారులు

image

జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం బాధితులతో కిటకిటలాడింది. భూ సమస్యలు, అక్రమ తవ్వకాలపై ప్రజలు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి మొరపెట్టుకున్నారు. మణుగూరుకు చెందిన దేవిశ్రీ తన భర్తకు రావాల్సిన పరిహారం కోరగా, తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సామాన్యుల సమస్యల పట్ల అధికారులు బాధ్యతగా వ్యవహరించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆయన సూచించారు.

News April 6, 2026

రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం మార్కెట్ కమిటీ సభ్యులు సెలవు ప్రకటించారు. ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మిర్చి శాఖ కార్యదర్శి సతీష్ కుమార్ సతీమణి అకాల మృతికి చింతిస్తూ మిర్చి శాఖ సభ్యుల కోరిక మేరకు సెలవు ప్రకటించినట్లు చెప్పారు. తిరిగి ఈనెల 8వ తేదీ బుధవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించారని పేర్కొన్నారు.

News April 6, 2026

ముదిగొండ: నేడు ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన

image

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి నేడు ముదిగొండ మండలంలో పర్యటించనున్నారు. ఎంపీ నిధులతో న్యూ లక్ష్మీపురం, పమ్మి, వల్లభి తదితర గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, బోర్లను ఆయన ప్రారంభించనున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి జరిగే ఈ అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

News April 6, 2026

ఖమ్మం: గాలివాన వచ్చినా విద్యుత్ ఆగదు!

image

ఖమ్మం జిల్లాలో వర్షాల వల్ల విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులు 5 ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్స్‌ను రంగంలోకి దించారు. ఐటీఐ నిపుణులతో కూడిన ఈ బృందాలు ఖమ్మం, మధిర, సత్తుపల్లిలో అందుబాటులో ఉంటాయి. వీరికి ప్రత్యేక వాహనాలు, పనిముట్లు అందించారు. సమస్య తలెత్తితే వెంటనే 1912 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు.

News April 6, 2026

ఖమ్మం: జాగ్రత్త.. బయట ఆహారం వద్దు!

image

ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బయట ఆహారం తీసుకోవద్దని, తగినంత మంచినీరు తాగుతూ ఎండల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. మరోవైపు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, అందుబాటులో ఉన్న వనరులను వాడుకుంటూ గొప్ప స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

News April 6, 2026

నేడు జిల్లావ్యాప్తంగా ‘ప్రజావాణి’

image

ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా కలెక్టరేట్‌కు లేదా స్థానిక ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి ఫిర్యాదులు అందజేయవచ్చని సూచించారు. అర్జీలను స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.