Khammam

News April 5, 2026

ఖమ్మం జిల్లాలో 8న పాడైన చక్కెర వేలం

image

ఖమ్మం జిల్లాలోని గోదాముల్లో నిల్వ ఉన్న, వినియోగానికి పనికిరాని చక్కెరను వేలం వేయనున్నట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలత తెలిపారు. ఈనెల 8న ఖమ్మం అర్బన్, 9న నేలకొండపల్లి, వైరా, 10న ఏన్కూరు, సత్తుపల్లి కేంద్రాల్లో వేలం నిర్వహించనున్నారు. మొత్తం సుమారు 23.84 మెట్రిక్ టన్నుల చక్కెర వేలం వేస్తామని, వేలం దక్కించుకున్న వారే రవాణా ఖర్చులు భరించాలని ఆమె స్పష్టం చేశారు.

News April 5, 2026

ఖమ్మం జిల్లా పరిషత్‌కు 62 ఏళ్లు.. నిధుల కొరత

image

ఖమ్మం జిల్లా పరిషత్‌కు 62 ఏళ్లు పూర్తయ్యాయి. 1964 ఏప్రిల్ 6న కామరాజ్ నాడార్ చేతుల మీదుగా భవనం ప్రారంభమైంది. అప్పటి నుంచి అభివృద్ధి పనుల్లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం పాలకవర్గం లేక ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయి. గత రెండేళ్లుగా సాధారణ, ఎస్ఎఫ్సీ నిధులు రాకపోవడంతో జిల్లా పరిషత్, మండల పరిషత్తులలో అభివృద్ధి పనులు నిలిచినట్లు అధికారులు తెలిపారు.

News April 4, 2026

ఖమ్మం: ఏప్రిల్ 19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు

image

ఖమ్మం జిల్లాలో తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 19న నిర్వహించనున్నట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు. 6వ తరగతి పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7–10 తరగతుల పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. కారేపల్లి, టేకులపల్లి కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సూచించారు.

News April 4, 2026

ఖమ్మం:దివ్యాంగ విద్యార్థులకు ‘డిజిటల్’ భరోసా

image

వైకల్యం చదువుకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక సాయం అందిస్తోంది. జిల్లాలో ఉన్నత విద్య చదివే వారికి 47 ల్యాప్‌టాప్‌లు, ఇంటర్ విద్యార్థులకు 25 ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు 100 మోటార్ వాహనాలు, బ్యాటరీ వీల్ చైర్లను కేటాయించారు. డిజిటల్ విద్యతో సామాన్య విద్యార్థులతో పోటీపడేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత తెలిపారు.

News April 4, 2026

ఖమ్మం: ALERT.. 2 రోజులు బంద్..!

image

కొత్త సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ సేవ’ కేంద్రాల్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ పనుల నిమిత్తం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి సుమారు 36 గంటల పాటు ఈ అంతరాయం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో, తిరిగి సోమవారం ఉదయం నుంచి సేవలు యథావిధిగా అందుబాటులోకి రానున్నాయని, వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.