India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా జర్మనీలో 90 నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన వారికి రూ.2.2 లక్షల నుంచి రూ.3 లక్షల వేతనం లభిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులకు జులైలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం మైనారిటీ నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహమ్మద్ ముజాహిద్ తెలిపారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో టామ్ కామ్ ద్వారా ఆస్ట్రేలియా, ఒమన్, జర్మనీ, ఖతర్, గ్రీస్ దేశాల్లో పలు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 20 లోపు కలెక్టరేట్‌లో దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 97040 03002ను సంప్రదించాలన్నారు.

ఉపాధి హామీ పథకంలో ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం జిల్లాలోని కూలీలకు చుక్కలు చూపిస్తోంది. ఉదయాన్నే పనులకు వెళ్తున్న కూలీల హాజరును నమోదు చేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంత ప్రయత్నించినా గంటల తరబడి సాఫ్ట్‌వేర్ స్పందించకపోవడంతో పనులకు ఆటంకం కలుగుతోందని కూలీలు చెబుతున్నారు. వారంలో కనీసం 3రోజులు కూడా పనిదొరకడం లేదని వాపోతున్నారు.

ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న 2 పాడి గేదెల పెంపకం పథకం దరఖాస్తు గడువును ఏప్రిల్ 16 వరకు పొడిగించినట్లు ఈడీ నవీన్ బాబు గురువారం తెలిపారు. అభ్యర్థులు tgobmms వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ చేసిన దరఖాస్తులను సంబంధిత కార్యాలయాల్లో పత్రాలతో సమర్పించాలని చెప్పారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఖమ్మం కార్పొరేషన్‌లో వీధి కుక్కల నియంత్రణ లేకపోవడంతో రోడ్లపై జనాలు తిరిగే పరిస్థితి లేకుండా పోతోంది. ఏ వీధిలో చూసినా గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలు రహదారులపై వచ్చే వారికి చుక్కలు చూపిస్తున్నాయి. ఏడాదిలో కుక్కల దాడిలో అనేకమంది గాయపడగా, కొందరు చనిపోయారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ABC సెంటర్ తాజా స్థితి ఎవరికి అంతుచిక్కని పరిస్థితి అని స్థానికులు మండిపడుతున్నారు.

ముదిగొండలో నిర్మాణంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. భవన నిర్మాణ ప్రాంతమంతా కలియదిరిగి పనుల నాణ్యతను, పురోగతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షించుకోవాలని, అవసరమైన చోట సిబ్బందిని పెంచి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

డిజిటల్ హాజరు (FRS) నమోదులో ఖమ్మం జిల్లా 80.88 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పెనుబల్లి మండలం 92.68 శాతంతో జిల్లాలో టాప్‌లో ఉంది. ఈ విధానం వల్ల మధ్యాహ్న భోజన బిల్లుల్లో అక్రమాలకు చెక్ పడిందని, అధికారుల సమష్టి కృషితో ఈ ఘనత సాధ్యమైందని డీఈవో చైతన్య జైనీ పేర్కొన్నారు.

జిల్లా ఆసుపత్రి నేత్ర వైద్య విభాగం మరో అడుగు ముందుకేసింది. రోగులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా కొత్త పరికరాలను అందుబాటులోకి తెచ్చినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ వెల్లడించారు. A-స్కాన్ ద్వారా కంటి బయోమెట్రి కొలతలు, B-స్కాన్ ద్వారా రెటీనా వంటి కీలక భాగాల చిత్రాలను తీయవచ్చని వివరించారు. ఈ వసతులను రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్త సేవలపై రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.