India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుమలాయపాలెం మండలం పడమటితండాకు చెందిన రైతు భూక్య భద్రు (కోటి) శనివారం తన వ్యవసాయ క్షేత్రంలోని బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలా కాకుండా తమ ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన LRS తప్పుల తడకగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తప్పుడు లెక్కలతో ల్యాండ్ వాల్యూ ఎక్కువగా నమోదు చేయడంతో అనేక మంది రూ.వేలు, లక్షల అదనంగా చెల్లించి నష్టపోయారు. అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించే దిశగా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని, తక్షణమే తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

గ్రీస్‌లోని హాస్పిటాలిటీ, సేవా రంగాలలో 1,000 విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ తెలిపారు. హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా/డిగ్రీ ఉన్నవారు, ప్రభుత్వ అనుమతితో నైపుణ్య ధ్రువీకరణ పొందిన అభ్యర్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగలవారు తమ రెజ్యూమ్‌లను tomcom.resume@gmail.com కు మెయిల్ చేయాలని సూచించారు.

ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షించారు. ఈ నెల 13 నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని తెలిపారు. నగరంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని, మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. ఈ సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల హాజరవుతారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు సకాలంలో హాజరు కావాలని వారు కోరారు.

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో.. పీహెచ్‌సీల్లో 100% సిబ్బంది హాజరు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలని, అధిక సీ-సెక్షన్ డెలివరీలు చేసే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఎన్సీడీ సర్వే, టీకాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. పీహెచ్సీలలో పనిచేసే ప్రతి సిబ్బంది అటెండెన్స్‌ను ఆన్లైన్ చేసి, 100% మానిటరింగ్ చేయాలన్నారు. ప్రతి వైద్యాధికారి తన పరిధిలోని ఆశా కార్యకర్తలతో తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

ఖమ్మం జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎండీ ముజాహీద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఖమ్మం కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.

ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. పిండిప్రోలు గ్రామానికి చెందిన కాంపాటి ఆశాకుమారి(45) పశువుల మేతకోసం చేను వద్దకు వెళ్లి గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో జారి పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
Sorry, no posts matched your criteria.