India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలన, పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తమ వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఉదయం కాసేపు గడిపారు. పచ్చని పంట పొల్లాల్లో కలియ తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించారు. ఆయిల్ పామ్ సాగులో ఇంకా తీసుకోవాల్సిన చర్యలు, సస్య రక్షణ పద్ధతుల గురించి కూలీలతో చర్చించారు.
మరో రెండు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ మొదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలకు, కులాలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని చెప్పారు. గత BRS ప్రభుత్వంలో పింక్ కలర్ చొక్కా వేసుకున్న వాళ్లకే స్కీములు ఇచ్చారని అన్నారు. అర్హులైన వారు ఏ పార్టీలో ఉన్నా ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిరాజుగూడెంకు చెందిన సాయి(22) తన బైక్‌పై ఆదివారం రాత్రి ఖమ్మం నుంచి ఇంటికి వస్తుండగా ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో సాయికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సాయిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. సాయి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
☆ ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో నేడు ప్రజావాణి కార్యక్రమం ☆ ఖమ్మంలో నేడు మంత్రి తుమ్మల పర్యటన ☆ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నేడు పునః ప్రారంభం ☆ తిరుమలాయపాలెం కాంగ్రెస్ నేతలతో నేడు మంత్రి పొంగులేటి సమావేశం ☆ కారేపల్లిలో నేడు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ☆ భద్రాచలం ఐటిడిఏలో నేడు గిరిజన దర్బార్ కార్యక్రమం ☆ ఉమ్మడి జిల్లాలో నేడు కార్తీక మాసం మొదటి సోమవారం వేడుకలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు పునః ప్రారంభం కానున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. వరుసగా నాలుగు రోజుల సెలవులు అనంతరం సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
ప్రభుత్వాల తలరాత మార్చే శక్తి ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలో ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని కోరారు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులదే కీలకపాత్ర అని పేర్కొన్నారు.
నేలకొండపల్లి మండలం చెన్నారం పాండవ చెలక కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని పగడాల నాగయ్య (70) అనే వృద్ధుడు మృతి చెందాడు. తన కుమారుడి ఇంటికి సమీపంలో చిన్న రేకుల గదిలో వృద్ధుడు ఉంటున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా.? మరేదైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు.
మణుగూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హై స్కూల్లో కరెంట్ షాక్‌తో ఇద్దరు వాచ్‌మెన్లు మృతి చెందారు. ఈరోజు ఉ.5.30కు పాఠశాల ఆవరణలో ఉన్న విద్యుత్ మెయిన్ తీగలకు పాఠశాలలో ఉన్న ఇనుప స్తంభం తీస్తుంగా.. విద్యుత్ తీగలకు తగలడంతో మణుగూరుకు చెందిన ఉపేందర్, రత్నం వాచ్‌మెన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి మృతితో దుఃఖసాగరంలో మునిగారు.
రాష్ట్ర వ్యాప్తంగా నవంబరు 4 వరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిందే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలిచ్చారు. శనివారం ఆయన సచివాలయంలో పత్తి కొనుగోళ్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సౌకర్యంగా పంటను విక్రయించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.