India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో సోమవారం ఉదయం 8:30 నుంచి నేడు ఉదయం 8:30 గంటల వరకు 56.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 2.7 మి.మీగా నమోదు కాగా, అత్యధికంగా ఖమ్మం రూరల్‌లో 15.4 మి.మీ అత్యల్పంగా తిరుమలాయపాలెంలో 0.8MM వర్షపాతం నమోదైంది. వేంసూరు 8.2, కల్లూరు6.4, ముదిగొండ 5.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు.

చింతకాని మండలంలోని 5 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రత్యేక యాప్ ద్వారా పిల్లల రీడింగ్ సామర్థ్యం పెంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3–4 గంటల రీడింగ్ ఫోకస్ పీరియడ్ నిర్వహించి, ప్రతి విద్యార్థి చదివే సామర్థ్యం పెంపొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణకు సంబంధించి అక్టోబర్ 8లోపు టెండర్లు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. ఆర్డర్ ఇచ్చిన నాలుగు రోజుల్లోపు బ్యాలెట్ పేపర్లను ముద్రణ చేయాలని ఆదేశించారు. ముద్రణకు అవసరమైన సింబల్ బ్లాక్స్, పింక్, వైట్ పేపర్ వంటి సామాగ్రిని సరఫరా చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రెసీ కాలేజ్, ఖమ్మంలోని sr&bgnr కళాశాల, బారుగూడెంలోని మహ్మదీయ కళాశాలల నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను పరిశీలించారు.

ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. 3 వేల మంది విద్యార్థుల వసతి, తాగునీరు, విద్యుదీకరణ, సబ్‌స్టేషన్, క్రీడా ప్రాంగణం వంటి అన్ని సదుపాయాలతో భవనాలను వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభానికి సిద్ధంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని తాళ్లురి పల్లివి ప్రధాని మోదీ చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు అందుకుంది. ‘కౌశల్ దీక్షాంత్ సమారోహ్’ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధాని అందజేశారు. PM-SETUలో భాగంగా నిర్వహించిన కాంపిటేషన్‌లో AI ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ఈ అవార్డు లభించింది. దీంతో కళాశాల ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి గీతిక, ప్రిన్సిపల్ లక్షినారాయణ అభినందించారు.

కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వినోబా కాలనీలోని భూదాన బోర్డు స్థలాల్లో నివసిస్తున్న పేదలకు వసతులు కల్పించాలని సూచించారు. పలు మండలాలకు చెందిన పౌరుల సమస్యలపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

పండుగ సెలవులు ముగియడంతో ఖమ్మం కొత్త బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు తిరిగి నగరం (సిటీ) బాట పడుతుండటంతో రద్దీ నెలకొంది. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా మరిన్ని బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. కార్యాలయాలు, కళాశాలలు తెరుచుకోవడంతో ఈ రద్దీ ఏర్పడింది.

కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో 2002లో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 22 సంవత్సరాల తర్వాత ఆదివారం ఒకచోట కలుసుకున్నారు. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని పరవశించిపోయారు. తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా వారు తమ గురువులైన రాములు, యాకోబు, ముస్తఫా, నాగేశ్వరరావు, కుసుమ, ఉషారాణిలను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్రీజ అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నామినేషన్ల స్వీకరణ, పోస్టల్ బ్యాలెట్, టీమ్‌ల ఏర్పాటు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు పూర్తిస్థాయిలో శిక్షణ పొందాలని సూచించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.