India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేటి నుంచి ఆదివారం వరకు 4 రోజుల పాటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ వర్గాలు తెలిపాయి. ఈనెల 31న దీపావళి, వచ్చేనెల 1న అమావాస్య, 2వ తేదీన శనివారం వారాంతపు సెలవు, 3న ఆదివారం సాధారణ సెలవుగా ప్రకటించినట్లు వెల్లడించారు. తిరిగి సోమవారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు మొదలవుతాయనే విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు.
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలు ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} వైరాలో ఎమ్మెల్యే రామదాసు నాయక్ పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యాటన ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పలు శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత పది ఏళ్ల విధ్వంసపు పాలనలో చీకట్లు తొలగిపోయాయని.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలనలో తెలంగాణ సంతోషంగా ఉందని తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్న పెద్దలందరూ పండుగ జరుపుకోవాలని.. ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని పొంగులేటి విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం జిల్లాలోని రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపు చేసేందుకు బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చూపించడం తప్పనిసరని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం వరి ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారంటీపై మిల్లర్లతో, బ్యాంక్ అధికారులతో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజతో కలిసి సమావేశం నిర్వహించారు. మిల్లులకు సరఫరా చేసే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీ ఉండాలని చెప్పారు.
మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చెప్పారు. చర్ల ఎల్ఓఎస్ కమాండర్‌గా పనిచేస్తున్న సోది పోజి, ఎల్జీఎస్ కమాండర్‌గా పనిచేస్తున్న మడివి సోమిడి ఈరోజు భద్రాద్రి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని రోహిత్ రాజ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.
మధిర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. విజయవాడలో ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు దిగి వస్తుండగా, మధిర మండలం మల్లారానికి చెందిన కొంగర కేశవరావు, ఖమ్మంపాడుకు చెందిన కూతురు నూకారపు సరితపై చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కార్తీకమాసం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్ లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల నుంచి పంచరామాలు, అన్నవరం, శబరిమలై, అరుణాచలంకి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. బస్సుల బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్సైట్‌ను సందర్శించవలసిందిగా కోరారు.
కూనవరం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ బొదునూరులో ఎద్దుపై పులి దాడి చేసిందని రైతు సోడి శ్రీను తెలిపారు. పులి దాడిలో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందిందని అన్నారు. కాగా ఎద్దుపై పులి దాడి చేయడంతో బొదునూరు గ్రామానికి చెందిన ప్రజలు భయాందోళనలో ఉన్నారు. గ్రామ ప్రజలు పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని అందించారు.
> మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేటి పర్యటన వాయిదా > ఖమ్మం జిల్లాలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన > ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని దీక్ష > అశ్వరావుపేటలో గాలికుంటు నివారణ టీకాలు పంపిణీ > కొత్తగూడెంలో నేటితో ముగియనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు > పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన > బయ్యారంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
వరదల కారణంగా దెబ్బతిన్న కట్టలేరు మిషన్ భగీరథ పైప్ లైన్ పునరుద్ధరణ పనులు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎమ్మార్వో ఆఫీసులో త్రాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కట్టలేరు మిషన్ భగీరథ పునరుద్ధరణ పనులు వేగవంతంగా పూర్తయ్యే విధంగా కార్యాచరణ అమలు చేయాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.