India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇంటిగ్రేటెడ్ భూ భారతి’ పోర్టల్‌ను పైలెట్ ప్రాజెక్టుగా కూసుమంచి మండలంలో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ విధానంలో ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ సేవలు ఒకే చోట లభిస్తాయని పేర్కొన్నారు. రైతులు స్లాట్ బుక్ చేసుకుంటే వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి, ప్రతి భూమికి ప్రత్యేక ‘భూధార్’ నంబర్ కేటాయిస్తామని వెల్లడించారు.

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇంటిగ్రేటెడ్ భూ భారతి’ పోర్టల్‌ను పైలెట్ ప్రాజెక్టుగా కూసుమంచి మండలంలో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ విధానంలో ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ సేవలు ఒకే చోట లభిస్తాయని పేర్కొన్నారు. రైతులు స్లాట్ బుక్ చేసుకుంటే వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి, ప్రతి భూమికి ప్రత్యేక ‘భూధార్’ నంబర్ కేటాయిస్తామని వెల్లడించారు.

ఖమ్మం జిల్లాలోని తెలంగాణ గురుకుల (జనరల్), కస్తూరిబా గాంధీ జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కన్వీనర్ వేము రాజు తెలిపారు. MPC, BiPC, MEC, CEC గ్రూపుల్లో ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 15 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మే 3న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు రుసుము రూ.200 గా నిర్ణయించారు.

ముదిగొండ మండలం పండ్రెగుపల్లి గ్రామ సర్పంచి భర్త పాము సిల్వరాజు కిడ్నాప్ కేసులో 10 మంది నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మండలంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజకీయ కక్షల కారణంగానే ఈ కిడ్నాప్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఖమ్మం జిల్లావ్యాప్తంగా గురువారం జరిగిన పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 16,975 మంది విద్యార్థులకు గానూ 16,954 మంది హాజరయ్యారని, 21 మంది గైర్హాజరైనట్లు డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. డీఈవో చైతన్య జైని 2 కేంద్రాలను, డిస్ట్రిక్ట్ లెవల్ అబ్జర్వర్లు 6 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 36 కేంద్రాలను తనిఖీ చేశాయి.

ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఫ్లెక్సీల వ్యాపారం ఒక్కసారిగా పుంజుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా అన్ని శాఖల అధికారులు అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటంతో ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. నేటి నుంచి గ్రామసభలు ప్రారంభం కావడం, దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా తోడవడంతో ప్రింటింగ్ సెంటర్లు రేయింబవళ్లు పని చేస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డుల పంపిణీకి విద్యాశాఖ స్వస్తి పలికింది. ఏళ్ల తరబడి సరఫరా నిలిచిపోవడంతో హెడ్ మాస్టర్లు సొంత ఖర్చులతో కార్డులు కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ భారాన్ని తగ్గిస్తూ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక కేటగిరీ, ఆరు నుంచి పదో తరగతి వరకు మరో కేటగిరీగా విభజించి ఇకపై కేవలం ఆన్‌లైన్ ద్వారానే ఫలితాల కార్డులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

దేశవ్యాప్త జనగణనలో భాగంగా ఉమ్మడి ఖమ్మంలో మే 11 నుంచి జూన్ 9 వరకు గృహగణన నిర్వహించనున్నారు. ఈ మేరకు సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ షెడ్యూల్ విడుదల చేశారు. అధికారులు మొబైల్ యాప్ ద్వారా ఇంటి వసతులు, ఆస్తులపై 34 ప్రశ్నలతో వివరాలు సేకరిస్తారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తి కాగా, యంత్రాంగం సర్వేకు సిద్ధమైంది.

రబీ (యాసంగి) సీజన్ 2025-26 నందు ఖమ్మం జిల్లాలో 2 లక్షల 37 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో రబీ ధాన్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లు కనీసం లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దింపుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

బైక్‌ను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందారు. శంషాబాద్‌లో పనిచేస్తున్న నంబి ఫణిందర్(31) తన కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఖమ్మం వెళ్తుండగా.. కొణిజర్ల మండలం తనికెళ్ల శివారులోని శ్రీనిధి వెంచర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆటో ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో ఫణిందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సూరజ్ కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.