India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బైక్‌ను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందారు. శంషాబాద్‌లో పనిచేస్తున్న నంబి ఫణిందర్(31) తన కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఖమ్మం వెళ్తుండగా.. కొణిజర్ల మండలం తనికెళ్ల శివారులోని శ్రీనిధి వెంచర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆటో ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో ఫణిందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సూరజ్ కేసు నమోదు చేశారు.

సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తెల్లవారుజాము వరకు మెరుపు దాడులు నిర్వహించారు. ఇంటి పన్నులు, భవన క్రమబద్ధీకరణలో భారీగా లంచాలు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు. ఉద్యోగుల ఫోన్ పే లావాదేవీలను పరిశీలించి, ఫోన్లను సీజ్ చేశారు. రూ.12 కోట్ల నిధులు రూ.12 లక్షలకు తగ్గడంపై కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు, పలువురు సిబ్బందికి విచారణ నోటీసులు జారీ చేశారు.

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో 748 దుకాణాల పరిధిలో 4,69,865 కార్డుదారులు ఉండగా, 13,28,400 మంది లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి నెలకు ఆరు కేజీల చొప్పున, మూడు నెలలకు గాను 2,54,71,860 కేజీల బియ్యం అవసరమని అధికారులు తెలిపారు.

ఆడశిశు గర్భస్రావాలు, గర్భపాతాలు, లింగనిర్ధారణ వంటి చట్టవిరుద్ధ చర్యలపై కఠిన నిఘా అవసరమని DMHO డా.రామారావు తెలిపారు. జిల్లాలో లింగ నిష్పత్తి తగ్గకుండ ఉండటం కోసం PCPNDT చట్టం-1994ను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులు, సంస్థలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని హెచ్చరించారు. అర్హత కల్గిన రేడియాలజిస్ట్/గైనకాలజిస్ట్ మాత్రమే స్కాన్ కేంద్రాలను నిర్వహించాలన్నారు.

ఖమ్మం జిల్లా ఇరిగేషన్ సీఈగా మంగళంపూడి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సీఈగా పనిచేసిన వెంకటరమేష్ బాబు మంగళవారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఖమ్మం ఎస్ఈగా కొనసాగుతున్న వెంకటేశ్వర్లకు సీఈగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జీవో విడుదల చేసింది. పదోన్నతి పొందిన ఆయనను ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది అభినందించారు.

రాష్ట్రంలో ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 2న జరిగే సభల్లో ప్రభుత్వ పథకాల వివరాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొని క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించాలని ఆదేశించారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక అమలుపై దిశానిర్దేశం చేశారు.

నేలకొండపల్లిలోని చారిత్రక బౌద్ధస్తూపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. లోక్‌సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. శాతవాహన కాలం నాటి ఈ కట్టడాన్ని ‘జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్’లో చేర్చాలని డిమాండ్ చేశారు. అక్కడ మ్యూజియం ఏర్పాటుతో పాటు మౌలిక వసతులు కల్పిస్తే విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.

Sorry, no posts matched your criteria.