India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కుటుంబ కలహాలతో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం పాల్వంచ మండలంలో చోటు చేసుకుంది. గంగాదేవిగుప్ప గ్రామానికి చెందిన వివాహిత స్వప్న(28) కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. స్వప్న మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమక్షంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పి.శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. కాగా నూతన అదనపు కలెక్టర్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈ నెల 31 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 31న దీపావళి, నవంబర్ 1న అమావాస్య, నవంబర్ 2,3 తేదీల్లో వారంతపు సెలవులు కారణంగా వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తిరిగి నవంబర్ 4వ తేదీ నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఖమ్మం: రాష్ట్రంలో చేపట్టనున్న కుల గణన దేశవ్యాప్తంగా ఒక మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 300 మంది సామాజికవేత్తలు, మేధావులు, అభ్యుదయ వాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను, సందేశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కుల గణన చేస్తామని హామీ ఇచ్చామని ఇప్పుడు హామీని అమలు చేస్తున్నామన్నారు.
ఖమ్మం జిల్లాలోని ఐటిఐలలో ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సుల ప్రవేశాల కొరకు బుధవారం చివరి గడువు అని అదనపు కలెక్టర్ శ్రీజ ఓ ప్రకటనలో తెలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులలో చేరడానికి అడ్మిషన్ కోసం ttps://iti.telangana.gov.in ఆన్ లైన్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఖమ్మం: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలం చెన్నారంకి చెందిన ఆవుల లచ్చాది తన భార్యతో బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం ప్రమాదంలోఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లచ్చాది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
ఖమ్మం: చిట్టి నాయుడు చిల్లర డ్రామాలు అట్టర్ ప్లాప్ అయ్యాయని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఆశపడి ప్రజలు మోసపోయారని సోమవారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన చెప్పారు. హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయడం చేతకాకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని విమర్శించారు.
భద్రాద్రి రామాలయంలో లడ్డు ప్రసాదంలో వినియోగించే వస్తువుల సముదాయాన్ని ఇటీవల ఫుడ్ లాబరేటరీ అధికారులు తనిఖీ చేసే శాంపిళ్లను సేకరించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ప్రసాదం తనిఖీ నివేదిక వచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. పప్పు, దినుసులు, బియ్యం, నెయ్యి అన్నీ నాణ్యమైనవిగా ఉన్నట్లు నివేదికలో వచ్చినట్లు ఈవో చెప్పారు.
పలు డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు చేస్తోన్న TGSP సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శనివారం 39 మందిని సస్పెండ్ చేసిన అధికారులు వారిలో 10 మందిని డిస్మిస్ చేశారు. ఆరో బెటాలియన్ కొత్తగూడెంకు చెందిన కానిస్టేబుల్ భూషణ్ రావు అందులో ఉన్నారు. ఈ మేరకు ఏడీజీ సంజయ్ ఉత్తర్వులిచ్చారు. ఒకే రాష్ట్రం- ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ కానిస్టేబుళ్లు, వారి భార్యలు ధర్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.