Khammam

News August 18, 2025

ఖమ్మం: పంట.. వర్షం తంటా!

image

ఎడతెరిపి లేని వర్షాలతో రైతు అవస్థలు పాలవుతున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసి చేతికందే దశలో పంటలు వర్షాలకు నీటిపాలవుతున్నాయి. ఇప్పటికే వరదల కారణంగా కొంత మేరకు పత్తి, వరి పంటలు జలమయం కాగా ప్రతి రోజు విరామం లేకుండా కురుస్తున్న వర్షానికి పంటలు నేలవారటం తోపాటు కుళ్ళిపోతున్నాయి. తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ గ్రామాల్లో ఆ పరిస్థితి ఉందా..?

News August 18, 2025

ఖమ్మం: లైసెన్స్‌డ్ సర్వేయర్లకు నేటి నుంచి శిక్షణ

image

తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే మొదటి విడత శిక్షణ పూర్తవగా, రెండో విడత శిక్షణ ఉమ్మడి ఖమ్మం సహా 23 జిల్లా కేంద్రాల్లో సోమవారం నుంచి ప్రారంభం కానుంది.

News August 17, 2025

తల్లాడ: ‘బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి’

image

వంగవీటి మోహనరంగా బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్ అన్నారు. తల్లాడ మండలంని రామచంద్రాపురంలో ఆయన వంగవీటి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. వంగవీటి పార్టీలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా సేవలు చేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News August 17, 2025

శంకరగిరి తండాలో అంబరాన్ని అంటిన తీజ్ సంబరాలు

image

నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో ఆదివారం తీజ్ సంబరాలు ఘనంగా జరిగాయి. బంజారా, లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఈ వేడుకను నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ వేడుకలు ముగింపు సందర్భంగా యువతులు నృత్యాలతో సందడి చేశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.

News August 17, 2025

బోనకల్: సీపీఎం సీనియర్ నాయకుడిని కలిసిన కేరళ ఎమ్మెల్యే

image

బోనకల్ మండలం గోవిందాపురం గ్రామంలో సీపీఎం సీనియర్ నాయకుడు మాధినేని నారాయణను కేరళ ఎమ్మెల్యే కె.కె.రామచంద్రన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి సీనియర్ నాయకుల అనుభవం, మార్గదర్శకత్వం అవసరమని రామచంద్రన్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో స్థానిక సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

News August 17, 2025

ఖమ్మం జిల్లాలో 24 గంటల్లో 15.6 మి.మీ. వర్షపాతం

image

ఖమ్మం జిల్లాలో గత 24 గంటల్లో 15.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. తల్లాడలో అత్యధికంగా 6.2 మి.మీ., నెలకొండపల్లిలో 3.6, సింగరేణిలో 2.6, వైరాలో 1.2, కామేపల్లిలో 1.0, ఎన్కూరులో 0.8 మి.మీ. వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని, జిల్లా సగటు వర్షపాతం 0.7 మి.మీ.గా ఉందని అధికారులు పేర్కొన్నారు

News August 17, 2025

ఖమ్మం: తగ్గుముఖం పట్టిన మున్నేరు

image

మున్నేరుకు వరద ఆదివారం ఉదయం తగ్గుముఖం పట్టింది. ఉదయం 7 గంటలకు నీటిమట్టం 13 అడుగులకు తగ్గింది. శనివారం రాత్రి గంట గంటకూ పెరుగుతూ 15 అడుగుల వరకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద తగ్గుముఖం పట్టడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అవసరం లేకుండా పోయింది. ఈ పరిస్థితిని జిల్లా కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఇతర రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమీక్షించారు.

News August 17, 2025

ఖమ్మంలో రెండు రోజులు పూల వ్యాపారం బంద్

image

ఖమ్మంలో ఈ నెల 18, 19 తేదీలలో పూల వ్యాపారం పూర్తిగా నిలిచిపోనుంది. ప్రతిరోజు వ్యాపారం చేసే వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటానికి, పండుగల సమయంలో కొత్తగా వ్యాపారం చేసే వారికి ఎవరూ సహకరించవద్దని నగర పూల వ్యాపారస్తుల సంఘం నిర్ణయం తీసుకుంది. పాతవ్యాపారస్తులందరూ భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని సంఘం పిలుపునిచ్చింది. బంద్‌కు సహకరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News August 16, 2025

‘మున్నేరు పరివాహకా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

image

మున్నేరుకు వరద ప్రవాహం పెరగడంతో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులను సమన్వయంతో పనిచేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎగువన వర్షాలు అధికంగా కురుస్తున్నందున వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News August 16, 2025

ఖమ్మం కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు..!

image

మున్నేరు నదికి వరదలు పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టరేట్‌లో టోల్-ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఫిర్యాదు చేయడానికి 1077, 9063211298 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు స్థానికంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.