India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మున్నేరు వరద ఉధృతి నేపథ్యంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, వార్డు అధికారులు, వాలంటీర్లను నియమించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు వారికి సూచించారు. ప్రతి ఒక్కరూ తమ విధులను కేవలం బాధ్యతగా కాకుండా, పౌర సేవగా భావించాలని కోరారు.
ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో మొత్తం 579.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. కొనిజర్లలో అత్యధికంగా 70.9 మి.మీ, ఎర్రుపాలెం మండలంలో అసలు వర్షపాతం నమోదు కాలేదని సింగరేణి 61.4 మి.మీ, వైరా 55.4 మి.మీ, కుసుమాంచి 47.8 మి.మీ, కామేపల్లి 46.7 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం పాలేరు రిజర్వాయర్‌ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో ఉన్న నీటి నిల్వ, ఇన్ ఫ్లో ఎంత, ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఎంత, తదితర వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు.
ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డాక్టర్ పి.శ్రీజ ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మం పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. క్షేత్రస్థాయిలో వివిధ శాఖల ఉద్యోగుల కృషి, సహకారం వల్లనే ఈ పురస్కారం పొందానని సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్యాలంటరీ మెడల్ స్వీకరించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతో ధైర్య సాహసాలతో సమర్థవంతంగా నిర్వర్తించినందుకుగాను పోలీస్ కమిషనర్ గ్యాలంటరీ మెడల్-2024 కు ఎంపికయ్యారు. పోలీస్ కమిషనర్ కు గ్యాలంటరీ మెడల్ రావడం పట్ల జిల్లా పోలీస్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో గణేష్ నిమజ్జనం జరిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. మున్నేరు నదిలో వినాయక నిమజ్జనం పాయింట్లుగా ఏర్పాటు చేయుటకు పెద్దతండ, ప్రకాష్ నగర్ వద్ద ప్రాంతాలను అదనపు కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. గణేష్ నిమజ్జన పాయింట్ల వద్ద అవసరమైన మేరకు భారీ క్రేన్లు, లైటింగ్ ఏర్పాట్లు, సీసీటీవీ ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
ఖమ్మం ప్రకాష్ నగర్ వంతెన పైనుంచి మున్నేరు వరద ప్రవాహాన్ని శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. అటు అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గత వరద అనుభవాలు దృష్టిలో పెట్టుకుని సహాయ చర్యలకు ప్రణాళిక సిద్ధం చేసి సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో అంబరాన్ని తాకాయి. Dy.CM మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా విచ్చేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి పథకాలను వివరించి ప్రజలకు సంక్షేమం పట్ల ప్రభుత్వ కట్టుబాట్లను వివరించారు. వేడుకల్లో అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి.శ్రీజ సమక్షంలో విద్యాశాఖ అధికారులతో యూడీఐఎస్ఈ నమోదు, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, అపార్ రిజిస్ట్రేషన్, మధ్యాహ్న భోజనం, పాఠశాలల అభివృద్ధి వంటి అంశాలపై సమీక్షించారు. ఇకపై ప్రతి నెల 4వ శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాగ్‌లెస్ డేగా నిర్వహించి, క్రీడలు, పాటలు, వంటి కార్యక్రమాలు ఏర్పాటు ఏర్పాటు చేయాలని ఆదేశించారు
ఖమ్మం జిల్లాలో గురువారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 31.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రఘునాథపాలెం 7.1, సత్తుపల్లి 6.1, సింగరేణి 5.0, KMM(R) 3.5, తిరుమలాయపాలెం 3.0, వేంసూరు 2.5, కల్లూరు 2.0, కొణిజర్ల 1.4, పెనుబల్లి 0.8, KMM(U) 0.2 మిల్లీమీటర్లు నమోదైనట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.