India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఎన్హెచ్ అధికారులు, రాష్ట్ర అధికారులు సమన్వయంతో రైతులను సంప్రదించి, వారికి తగిన పరిహారంపై భరోసా కల్పించాలని సూచించారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. ఎన్హెచ్ 163జి పరిధిలోని 42 హెక్టార్ల భూసేకరణలో ఎక్కువ భాగం ఇప్పటికే పూర్తయిందని తెలిపారు.

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. కారుణ్య నియామకాలకు J.అసిస్టెంట్, ఓఎస్ ఖాళీల వివరాలను వారం రోజుల్లో అందించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లాలో గృహ నిర్మాణాల కోసం సాండ్ బజార్ల ద్వారా పారదర్శకంగా ఇసుక సరఫరా చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కూసుమంచి, మధిర, కామేపల్లి, సత్తుపల్లి, ఖమ్మం కేంద్రాల్లో మొత్తం 5,194 మె.ట ఇసుక అందుబాటులో ఉందని, ఇందులో 4,560 టన్నుల నిల్వలు ఉన్నాయని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు టన్ను రూ.1,100 చొప్పున కూపన్ విధానంలో మహిళా సంఘాల ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నామని తెలిపారు.

ఖమ్మం జిల్లాలో వానాకాలం పంటలకు అవసరమైన యూరియాను రైతులకు సకాలంలో అందజేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం తెలిపారు. జిల్లాకు కేటాయించిన 41,000 మెట్రిక్ టన్నులలో 32,494 మెట్రిక్ టన్నులు పంపిణీ అయ్యాయి. PACS, సేవా కేంద్రాలు, డీలర్ల ద్వారా కూపన్లు ఆధారంగా సరఫరా జరుగుతోందని చెప్పారు. బ్లాక్ మార్కెట్, అధిక ధరల విక్రయాలను అరికట్టి, రైతుల సౌకర్యానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలో అక్రమ ఇసుక, మట్టి రవాణా నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. డి.ఎస్.ఆర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండలాల వారీగా ఇసుక వనరులు, గనుల సర్వే నివేదికలను తయారు చేయాలని సూచించారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు.

ఖమ్మం: జాతీయ రహదారులకు భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణా రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్హెచ్ 163జీ, రింగ్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ హైవే, ఎన్హెచ్65 వంటి ప్రాజెక్టుల భూసేకరణలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. అక్టోబర్ చివరి నాటికి ఖమ్మం జిల్లాలో 42 హెక్టార్ల భూసేకరణ పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

KMM: ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక అక్రమ రవాణా నియంత్రించడానికి జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. 24 గంటల పర్యవేక్షణ కోసం 3 షిఫ్టులలో సిబ్బంది పనిచేస్తారన్నారు. చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు, స్థానిక పోలీస్, స్పెషల్ బ్రాంచ్ అధికారుల సమన్వయంతో అక్రమ ఇసుక వాహనాల జప్తు, కేసులు నమోదు చేస్తూ నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

మైనారిటీల కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రారంభించిందని జిల్లా సంక్షేమ అధికారి మహమ్మద్ ముజాహిద్ తెలిపారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్న కా సహారా పథకాలకు మైనారిటీ, దూదేకుల, ఫకీర్లు చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. అక్టోబర్ 6 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయని, ఇతర వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

వానాకాలంలో ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మం జిల్లాలో 326 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 275 సన్నరకాలకు, 51 దొడ్డు రకాలకు ఉంటాయి. నవంబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ కొనుగోళ్లు జనవరి వరకు కొనసాగుతాయి. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా పీఏసీఎస్, డీసీఎంఎస్, మెప్మాల ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

చెల్లని చెక్కుకేసులో వ్యక్తికి 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి తీర్పునిచ్చారు. తీర్పు వివరాలిలా.. ముష్టికుంటకి చెందిన వెంకట్ నారాయణ రఘునాథపాలెంకి చెందిన శేషగిరిరావు వద్ద 2021లో రూ.18లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించే క్రమంలో రూ. 10లక్షల చెక్కును జారీ చేయగా ఖాతాలో నగదు లేకపోవడంతో రిజెక్ట్ అయ్యింది. కోర్టులో కేసు దాఖలు చేయగా జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు.
Sorry, no posts matched your criteria.